ఐపీఎల్ : ఓ క్లారిటీ వచ్చేసింది!

IPL 2017 Royal Challengers Bangalore vs Gujarat Lionsఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 10లో విరాట్ కోహ్లి నేతృత్వంలో ఆడుతోన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు గురించి ఓ స్పష్టత వచ్చేసింది. ఈ సీజన్ లో ఐపీఎల్ ప్లే ఆఫ్స్ నుండి వైదొలగిన మొదటి జట్టుగా బెంగుళూరు నిలవడం విశేషం. విరాట్ కోహ్లి, గేల్, డివిలియర్స్, వాట్సన్ వంటి హేమాహేమీలను, టీ20 స్పెషలిస్ట్ లను జట్టులో పెట్టుకుని కూడా ఒక్క విజయం సాధించడం కోసం పరితపిస్తున్నారు. ఆడిన 9 మ్యాచ్ లలో కేవలం 2 విజయాలను మాత్రమే సొంతం చేసుకున్న బెంగుళూరు టాప్ 4లో నిలవడం అసాధ్యమన్న విషయం తేటతెల్లమైంది.

ADVERTISEMENT

తాజాగా గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో జట్టు తప్పక గెలవాల్సిన పరిస్థితులలో చేతులెత్తేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగుళూరు కేవలం 134 పరుగులను మాత్రమే నమోదు చేసింది. అందులోనూ బౌలర్ పవన్ నేగి 32 పరుగులు చేయగా, బ్యాట్స్ మెన్లలో కేదార్ జాదవ్ ఒక్కడే 31 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. గేల్ 8, కోహ్లి 10, డివిలియర్స్ 5, హెడ్ 0, మనదీప్ సింగ్ 8 పరుగులకే అవుటై తీవ్రంగా నిరుత్సాహపరిచారు. దీంతో గుజరాత్ లయన్స్ పని చాలా సులభమైంది.

స్వల్ప లక్ష్యంలో భాగంగా 23 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినప్పటికీ, ఆరోన్ ఫించ్ 22 బంతుల్లో హాఫ్ సెంచరీతో చెలరేగడంతో మ్యాచ్ పూర్తిగా గుజరాత్ వైపుకు తిరిగింది. ఫించ్ 72 పరుగులు చేసి అవుట్ కాగా, కెప్టెన్ సురేష్ రైనా 34 పరుగులతో నాటౌట్ గా నిలిచి విజయానికి కావాల్సిన లాంచనలను పూర్తి చేసాడు. ఈ విజయంతో ఆడిన 8 మ్యాచ్ లలో మూడు విజయాలతో 6 పాయింట్లు సొంతం చేసుకుంది గుజరాత్. మిగిలి ఉన్న 6 మ్యాచ్ లలో ఖచ్చితంగా 5 విజయాలు సాధిస్తే గానీ, గుజరాత్ కు ప్లే ఆఫ్స్ దక్కే అవకాశాలు లేవు.

ADVERTISEMENT
Latest Stories