ఈ మధ్యకాలంలో జరిగిన హానెస్ట్ సక్సెస్ మీట్ ఇరుముడిదే

Ravi Teja at Irumudi success meet event

థియేటర్లో విడుదలైన 99% సినిమాలకి హిట్టు, ఫ్లాప్ సంబంధం లేకుండా సక్సెస్ మీట్లు నిర్వహిస్తుండడం చూస్తూనే ఉంటాం. ఓటీటీ ప్రెజర్ కోసం కొన్ని సక్సెస్ మీట్లు నిర్వహిస్తే, హీరో లేదా డైరెక్టర్ ఇగో సాటిస్ఫాక్షన్ కోసం ఇంకొన్ని నిర్వహిస్తుంటారు. కొన్ని సినిమాలకు మరీ కామెడీగా విడుదలైనరోజు సాయంత్రం లేదా మరుసటిరోజు ఉదయం నిర్వహించేసి చేతులు దులిపేసుకుంటూ ఉంటారు.

అయితే.. ఇవాళ (ఆగస్ట్ 24) నిర్వహించిన “ఇరుముడి” సక్సెస్ మీట్ మాత్రం చాలా విభిన్నంగా జరిగింది. అంటే అదేదో కొత్తగా చేసారనేం కాదు. ఈవెంట్లో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరి కళ్లల్లో, మాటల్లో, వ్యవహారశైలిలో ఆనందం, సంతృప్తి కనిపించాయి. కొందరు వాళ్ల జర్నీలు తలుచుకుని ఏడ్చారు, కొందరు అవకాశం వచ్చినందుకు సంతోషపడ్డారు, ఇంకొందరు ఈ సినిమాతో వాళ్ళకి గౌరవం వచ్చినందుకు సంతృప్తిపడ్డారు.

ADVERTISEMENT

అసలు పబ్లిక్ ఈవెంట్స్ అంటే వచ్చానా, వెళ్ళానా అన్నట్లుగా ఉండే రవితేజ.. సక్సెస్ మీట్ కి నవ్వుతూ రావడమే కాక డ్యాన్స్ చేస్తూ ఎంట్రీ ఇచ్చి అందరికీ హగ్ ఇవ్వడం మొదలుకొని చివర్లో స్పీచ్ ఇస్తూ ‘ఇది నాకు మాములు ఆనందం కాదు’ అంటూ మనస్పూర్తిగా మాట్లాడడం అనేది హైలైట్ గా నిలిచింది.

ఇక శివ నిర్వాణ స్కూల్ ఫేర్ వెల్ ఫంక్షన్ లో ప్రిన్సిపాల్ లాగా.. సినిమాకి, సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెబుతూ, కొందరిని స్టేజ్ మీదకి పిలిచి, ఇంకొందరిని నిల్చోబెట్టి మరీ మెచ్చుకోవడాన్ని ఆ టీమ్ మాత్రమే కాదు, చూసిన ఆడియన్స్ కూడా మర్చిపోరు.

ముఖ్యంగా కొమరయ్య అనే నటుడు తన 18 ఏళ్ల ప్రయాణాన్ని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్న తీరు, బేబీ నక్షత్రకు నిజ జీవితంలో తండ్రి లేడు అని శివ నిర్వాణ ఎమోషనల్ అవుతూ అందరికీ చెప్పి.. ఆమె తల్లిని పులి అంటూ పొగడడం అందరి కళ్లని తడి చేశాయి.

ఇక ప్రొడ్యూసర్లు రవి & నవీన్ లు తమ ఆనందాన్ని వీలైనంత సంతోషంగా షేర్ చేసుకోవడం, డిస్ట్రిబ్యూటర్లు వాళ్ల ఆనందాన్ని పంచుకోవడం వంటివన్నీ కలగలిసి “ఇరుముడి” సక్సెస్ మీట్ ను ఈమధ్యకాలంలో జరిగిన మోస్ట్ హానెస్ట్ సక్సెస్ మీట్ గా నిలిపాయి.

తెలుగు సినిమాకి, తెలుగు ప్రేక్షకులకి కావాల్సింది వందల కోట్ల పాన్ ఇండియా సినిమాలు మాత్రమే కాదు.. ఇలా అందరి కళ్ళల్లో, గుండెల్లో ఆనందాన్ని నింపే రూటెడ్ సినిమాలు కూడా. ఇరుముడి సక్సెస్ మీట్ లో చూసిన ఆనందాన్ని, భావోద్వేగాన్ని ఈమధ్యకాలంలో మరే ఇతర ఈవెంట్లో చూశాం చెప్పండి.

అందుకే రానున్న వారణాసి, రాకా, డ్రాగన్ లాంటి పాన్ ఇండియన్ సినిమాలతోపాటుగా ప్రతి స్టార్ హీరో నుండి ఇరుముడి లాంటి సింపుల్, ఎమోషనల్, రూటెడ్ సినిమా కూడా కావాలి. ఈ విషయాన్ని మన బడా హీరోలు, డైరెక్టర్లు త్వరగా రియలైజ్ అయ్యి.. జూన్ నుండి థియేటర్లలో కంటిన్యూ అవుతున్న ఆడియన్స్ ఫుట్ ఫాల్స్ మరిన్ని పెరగాలని కోరుకుందాం.

ADVERTISEMENT
Latest Stories