వైసీపీ 2.0 కోసం జగన్ ఇప్పటి నుంచే తన ఎన్నికల పద్మవ్యూహాన్ని రచిస్తున్నారా.? ఆ పద్మవ్యూహంలోకి జనసేనాని ని పంపాలని భావిస్తున్నారా.? అంటే ప్రస్తుతం పవన్ చుట్టూ జరుగుతున్న రాజకీయం, జనసేన ను చుట్టూ ముడుతున్న కాపు వివాదం అన్ని అందులో భాగమేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో కూడా జనసేన టార్గెట్ గా జగన్ కాపు కార్డు ని వాడుకున్నారు. అందుకోసం కాపు కుల నేతగా ప్రచారం పొందిన ముద్రగడ పద్మనాభం ను రంగంలోకి దింపారు. పవన్ కమ్మ వారికీ ఊడిగం చేయడానికి, బాబు పల్లకి మోయడానికి పనిచేస్తున్నారని, పవన్ కాపు ద్రోహి అంటూ ముద్రగడ ద్వారా కాపు సామాజికవర్గంలో చీలిక తెచ్చే ప్రయత్నం చేసారు.
పిఠాపురం పవన్ పోటీ చేసిన నియోజకవర్గంలో పవన్ ను ఓడించి తీరుతా, లేదంటే నా పేరును రెడ్డిగా మార్చుకుంటా అంటూ చివరికి పద్మనాభ రెడ్డి గా మారారు. అయితే నాడు పవన్ తన పై వైసీపీ చేస్తున్న మూడు పెళ్లిళ్లు అనే వ్యక్తిగత దాడి నుంచి ఓడిపోయాడు, రాజకీయాలకు పనికిరాడు అంటూ చేసే రాజకీయ విమర్శల వరకు అన్నిటిని ఎదురొడ్డి పోరాడారు.
అలాగే ముద్రగడ తో వైసీపీ పన్నిన కుల రాజకీయ ఉచ్చులో కూడా చిక్కుకోకుండా చాల చాకచక్యంగా వైసీపీ వ్యూహాన్ని ఛేదించారు. అయితే నాడు వైసీపీ వేసిన అన్ని ప్లాన్ లను జనసేన తిప్పికొట్టి వైసీపీ మీద రాజకీయంగా పై చేయి సాధించింది, అలాగే తన సామాజికవర్గం మద్దతును సాధించింది.
నాడు ముద్రగడ తో ప్లాన్ – A వైసీపీ కి బెడిసికొట్టడంతో నేడు వైసీపీ జనసేన కోసం ప్లాన్ బి ని సిద్ధం చేసిందా.? అందులో భాగంగానే కొంతమంది కాపు నేతలను, కాపు సామాజికవర్గ పెద్దలను తన ట్రాప్ లోకి తెచ్చుకుందా.? వారి భుజాల మీద తుపాకీ పెట్టి జనసేన ను రాజకీయంగా టార్గెట్ చేసేందుకు వైసీపీ ఇప్పటి నుంచే పునాదులు తవ్వుతుందా.?
నాటి ముద్రగడ, హరిరామ జోగయ్య స్థానాలను భర్తీ చేసేందుకు వైసీపీ నేడు కొత్తవారిని రంగంలోకి దింపుతుందా.? ఇప్పటికే కాపు సామాజికవర్గం ముసుగులో కొందరు కుల నాయకులు సోషల్ మీడియాలో పవన్ ను టార్గెట్ చేస్తున్నారు, జనసేన కాపు ద్రోహి అంటూ ప్రకటనలు చేస్తున్నారు.
ఒక పక్క వైసీపీ జనసేన అంటేనే కాపు సేన అంటూ జనసేన మంత్రులు, ఎమ్మెల్సీ, ఎంపీ ల సామాజికవర్గాల లెక్కలు ప్రచారం చేస్తున్నారు. మరోపక్క జనసేన కు వచ్చిన ఒక్క రాజ్యసభ సీటును కాపు సామాజికవర్గానికి కాకుండా కమ్మ వారికీ కట్టబెడతారా.? అంటూ పవన్ ను కాపు ద్రోహి అంటూ ప్రచారం చేస్తున్నారు.
ఇలా వైసీపీ రేపటి కోసం అన్నట్టుగా ఇప్పుడే జనసేన కేంద్రంగా కుల రాజకీయాలను మొదలుపెట్టి రెండు నాలుకలా ధోరణి అవలంభిస్తుంది. మరి ఈసారైనా జగన్ తన కుల పద్మవ్యూహంలో పవన్ ని బంధించగలడా.? జనసేన కు ఉచ్చు బిగించగలడా.?




