అవును. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మద్యం కుంభకోణంలో పోలీసులు అరెస్ట్ చేయడం ఖాయమే. ఈ మాట మరెవరో కాదు మాజీ మంత్రి పేర్ని నాని స్వయంగా చెప్పారు.
“గతంలో చంద్రబాబు నాయుడుని మేము అరెస్ట్ చేసినందున, ఇప్పుడు ఆయన కంటే కనీసం ఒక్క రోజైనా ఎక్కువగా జగన్‌ని జైల్లో పెట్టాలనే తాపత్రయమే తప్ప ఈ కేసులో బలమైన ఒక్క ఆధారం లేదు. జగన్‌కి సన్నిహితంగా ఉన్నవారందరినీ అరెస్ట్ చేసి వారితో జగన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు సృష్టిస్తున్నారు.
ఈ కేసులో అరెస్టుల సీక్వెన్స్ కూడా సరిగ్గా లేదు. ఈ కేసులో ఇంకా చాలా మందిని అరెస్ట్ చేయాల్సి ఉంది. కానీ ఎందుకు అరెస్ట్ చేయకుండా పంపించేస్తున్నారు?అంటే జగన్‌ని జైలుకి పంపించేందుకు మీకు తోడ్పడేవారందరినీ కాపాడేందుకే. ఈవిదంగా దొంగ సాక్ష్యాలతో జగన్‌ని అరెస్ట్ చేయాలని ఎంత ప్రయత్నించినా న్యాయస్థానాలలో చెల్లదు,” అని పేర్ని నాని అన్నారు.
జగన్‌ని అరెస్ట్ చేస్తామని ఇంతవరకు సిట్ అధికారులు, మంత్రులు, టీడీపీ నేతలు ఎవరూ అనలేదు. కానీ పేర్ని నాని మాట్లాడిన ఈ మాటలు వింటే గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లుంది.
అరెస్ట్ అయినవారికీ జగన్‌కి ఏం సంబంధం?అసలు ఈ కేసులో బలమైన సాక్ష్యాధారాలే లేవని వాదించినప్పుడు జగన్ అరెస్ట్ కాబోతున్నారంటూ పేర్ని నాని మాట్లాడటమే తప్పు. కానీ మాట్లాడారు.
జగన్ అరెస్టు ఖాయమని వైసీపీ గ్రహించినందున పార్టీ శ్రేణులను మానసికంగా సిద్దం చేసేందుకే పేర్ని నాని ఈవిదంగా మాట్లాడి ఉండవచ్చు.
జగన్ అరెస్టుకి పార్టీ శ్రేణులని ముందుగానే సిద్దం చేసుకోవడం మంచిదే. కానీ అంతకంటే ముందు, జగన్ జైలుకి వెళితే పార్టీని ఎవరు ముందుండి నడిపించాలో ఇప్పుడే నిర్ణయించుకుంటే మంచిది.
ఎందువల్ల అంటే ఆయన సతీమణి భారతి ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనడం లేదు. పాల్గొంటున్న విజయమ్మ, షర్మిలని మెడ పట్టుకొని బయటకు గెంటేశారు. ఢిల్లీలో చక్రం తిప్పి జగన్ అరెస్టుని అడ్డుకోగల వీర విధేయుడు విజయసాయి రెడ్డి కూడా ఇప్పుడు పార్టీలో లేకపోగా ఆయనే ఈ కేసులో దోషులందరి బట్టలు విప్పించి చట్టం ముందు నిలబెడతానని శపధం చేశారు.
కనుక జగన్ జైలుకి వెళితే, ఎటువంటి కేసులు లేని బొత్స సత్యనారాయణ ఒక్కరే పార్టీకి పెద్ద దిక్కుగా కనిపిస్తున్నారు. కానీ ఆయన నేతృత్వాన్ని వైసీపీలో ముదుర్లు అంగీకరిస్తారా?లేకుంటే భారతి ముందుకు వచ్చి పార్టీ బాధ్యతలు చేపడతారా?అనే విషయం రాబోయే రోజుల్లో తెలుస్తుంది.
ఏది ఏమైనప్పటికీ మద్యం కుంభకోణం కేసులో జరుగుతున్న పరిణామాలను, వాటి వేగం చూస్తుంటే జగన్ అరెస్టుకి కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లే అనిపిస్తుంది. బహుశః అందుకే పేర్ని నానితో వైసీపీ అప్పుడే ఇలా బ్యాటింగ్ మొదలుపెట్టేసిందని అనుకోవచ్చు.
– సంబంధం లేని వ్యక్తులను వేధిస్తున్నారు
లిక్కర్ స్కామ్ పేరుతో పోలీసులు అరెస్ట్ చేసిన బాలాజీ గోవిందప్పకు, వైయస్ జగన్‌కు ఏం సంబంధం? భారతీ సిమెంట్స్ ను వికాట్ అనే సంస్థకు అమ్మేసి చాలా సంవత్సరాలు అయ్యింది. దానిలో పనిచేస్తున్న అధికారితో వైయస్ జగన్‌కు ఏం సంబంధం? వైయస్ జగన్‌ను అరెస్ట్… pic.twitter.com/VkjfuDaEkN
— YSR Congress Party (@YSRCParty) May 16, 2025




