దేవర విషయంలో జాన్వీకి అసంతృప్తి ఉందా ?

Janhvi Kapoor Devara

జాన్వీ కపూర్ ని చరణ్ సరసన నటింపజేసి ఆమెను టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ చేయాలి అనేది చిరంజీవి కొన్నాళ్ల క్రితం కన్న కల. అందుకోసం పలుమార్లు ప్రయత్నించినా ఎందుకో సెట్ అవ్వలేదు. ఈలోపు జాన్వీ కపూర్ డెబ్యూ ఎన్టీఆర్ సరసన “దేవర” సినిమాతో అయ్యింది. ఆ సినిమాలో ఆమె గ్లామర్ & డ్యాన్స్ స్టెప్స్ ఎంతలా వైరల్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా “చుట్టమల్లే” పాటలో జాన్వీ అందాలకు దాసోహమవ్వని వారు లేరు.

అయితే.. సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం ఎందుకో జాన్వీకి అంత మంచి పేరు రాలేదు. ముఖ్యంగా.. ఆమె పెర్ఫార్మెన్స్ ను ట్రోల్ చేశారు. ఇక సినిమాలో ఆమె స్క్రీన్ టైమ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ విషయాన్ని జాన్వీ కూడా మనసుకి తీసుకున్నట్లుంది, అందుకే తర్వాత పలు హిందీ సినిమాల్లో నటించినా.. ఎక్కడా “దేవర” పేరు ఎత్తలేదు.

ADVERTISEMENT

ఇక విజయవాడలో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో జాన్వీ కపూర్ తెలుగులో స్పీచ్ ఇచ్చింది. అంతా బాగానే అయ్యింది అనుకునే తరుణంలో.. స్పీచ్ చివర్లో “ఈసారి మీరు నన్ను ఇంకా ఎక్కువగా చూస్తారు” అంటూ ముగించింది. ఈ ఎండింగ్ పంచ్ జాన్వీ ఇంకా “దేవర” విషయంలో అసంతృప్తిగానే ఉందని స్పష్టం చేసిందేమో అనిపించింది.

అయితే.. “పెద్ది” సినిమా విషయంలోనూ జాన్వికపూర్ పాత్ర పట్ల భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంత సీరియస్ స్పోర్ట్స్ డ్రామాలో, ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగులు, అంతటి ఎక్స్ పోజింగ్ అవసరమా? అనే ప్రశ్నలు కూడా తలెత్తాయి.

మరి.. జాన్వీ పాత్ర కానీ ఆమె నటన కానీ “పెద్ది” సినిమాలో ఏమేరకు ఆకట్టుకుంటుంది అనేది ఇంకో 48 గంటల్లో తెలిసిపోతుంది. అప్పుడు జనాలు చెప్తారు.. జాన్వీ ఎంత ఎక్కువ సేపు కనిపించింది? ఆమె పాత్ర ఏమేరకు ఆకట్టుకుంది? అనేది.

ADVERTISEMENT
Latest Stories