తెలుగుదేశం పార్టీపై గానీ, ఆ పార్టీకి సంబంధించిన నాయకులపై గానీ, ముఖ్యమంత్రిపై, ఆయన తనయుడుపై… ఇలా అందరి పేర్లను ప్రస్తావిస్తూ ఏ స్థాయిలో పవన్ విమర్శల వర్షం కురిపిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బహుశా ఇవే విమర్శలు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసి ఉంటే, ఈ పాటికి పవన్ ఎక్కడ ఉండేవారు అన్నది ప్రశ్నార్ధకం?! గానీ, ఏపీలో విరుచుకుపడడం మాత్రం పవన్ కు చెల్లుబాటు అయ్యింది.
[m9ad]
చంద్రబాబు అండ్ కోపై అదేపనిగా విరుచుకుపడే పవన్ కళ్యాణ్, ప్రతిపక్షంగా పూర్తిగా విఫలమైన జగన్ మోహన్ రెడ్డి పేరు ఉచ్చరించడానికి కూడా సాహసించకపోవడం దేనికి సంకేతాలు? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నాలుగవ వార్షికోత్సవ సభలో కూడా… జగన్ అంశం ప్రస్తావనకు వచ్చేసరికి, ఒక్కసారిగా చేతులు కట్టుకుని మాట్లాడిన పవన్, ఇప్పుడు కూడా అదే ట్రెండ్ ను అనుసరిస్తున్నట్లుగా కనపడుతోంది.
గురువారం నాడు జరిగిన బహిరంగసభలో…. “ముసలోళ్ళకు ముద్దులు పెడితే సరిపోదు… వారికి వృద్ధాశ్రమాలు కట్టించాలి… అది జనసేన చేస్తుంది…” అంటూ పరోక్షంగా జగన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు గానీ, జగన్ పేరును మాత్రం ఉచ్చరించలేకపోయారు. బహుశా బయటకు చెప్పలేని కారణాలతో జగన్ అంటే అభద్రతా భావం నెలకొందో, లేక అధిష్టానం ఆదేశాల ప్రకారం ఇలా అనుసరిస్తున్నారో అదీ కాక జగన్ పై విమర్శలు చేయడానికి ఇంకా సమయం మిగిలి ఉందని భావిస్తున్నారో ఏమో గానీ, పవన్ పోకడ మాత్రం అంతుచిక్కడం లేదు.



