నితిన్‌ తల్వార్‌కు మరో ఛాన్స్‌

Isha Talwar tollywoodయువ హీరో నితిన్‌ నటించిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’ చిత్రంలో మెయిన్‌ హీరోయిన్‌గా నిత్యామీనన్‌ నటించగా, సెకండ్‌ హీరోయిన్‌గా ఇషా తల్వార్‌ నటించిన విషయం తెల్సిందే. ఇషాకు ఆ సినిమాలో సరైన ప్రాముఖ్యత దక్కలేదు. అందంతో పాటు నటనతో కూడా ఆకట్టుకోగల ఈ బ్యూటీకి టాలీవుడ్‌లో సరైన ఎంట్రీ దక్కలేదు. దాంతో ఆ తర్వాత ఆఫర్లు రాలేదు. టాలీవుడ్‌లో ఆఫర్లు లేక పోవడంతో మలయాళంలో ఈమె ప్రయత్నాలు చేసింది. ఈమెకు మలయాళంలో వరుసగా సక్సెస్‌లు వచ్చాయి. దాంతో ఈమెను మళ్లీ టాలీవుడ్‌లోకి తీసుకు రావాలని నిర్మాత సాయి కొర్రపాటి భావించాడు.

నిర్మాత సాయి కొర్రపాటి ప్రస్తుతం నారా రోహిత్‌ హీరోగా ‘రాజా చేయి వేస్తే’ చిత్రంలో నటిస్తున్నాడు. యువ దర్శకుడు ప్రదీప్‌ ఈ సినిమాతో పరిచయం కాబోతున్నాడు. వైవిధ్యభరిత కథాంశంతో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్రకు ఇషా తల్వార్‌ అయితే బాగా సూట్‌ అవుతుందనే ఉద్దేశ్యంతో ఈమెను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఈమెకు ప్రస్తుతం మలయాళంలో వరుసగా ఆఫర్లు వస్తున్నపటికి టాలీవుడ్‌ మార్కెట్‌ పెద్దది అవ్వడంతో పాటు పారితోషికం ఎక్కువగా వస్తుందనే ఉద్దేశ్యంతో ఈమె నారా రోహిత్‌ సరసన నటించేందుకు వెంటనే ఓకే చెప్పిందట. ఈ సినిమా తర్వాత ఇషాకు తెలుగులో వరుసగా ఆఫర్లు వస్తాయని నిర్మాత సాయి కొర్రపాటి చెబుతున్నాడు.

ADVERTISEMENT
Latest Stories