జగదీశ్ రెడ్డి…బిఆర్ఎస్ నేతగానా.? రెడ్డి నాయకుడిగానా.?

Jagadish Reddy speaking at a political event

తెలంగాణలో జనసేన విస్తరణ, తెలంగాణలో జనసేన పార్టీ కార్యలయం ఏర్పాటు పై బిఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి పవన్ టార్గెట్ గా విమర్శలు సంధిస్తున్నారు. అయితే ఆయన విమర్శలు గమనిస్తే జగదీశ్ రెడ్డి బిఆర్ఎస్ నేతగా పవన్ ను టార్గెట్ చేస్తున్నారా.? లేదా రెడ్డి నాయకుడిగా పవన్ ను విమర్శిస్తున్నారా అన్న సందేహం కలుగుతుంది.

పవన్ కళ్యాణ్ ది ఒక డ్రామా కంపెనీ అని, ఆయన వెనుక బీజేపీ ఉందని, మోడీ, బాబు, పవన్, రేవంత్ అందరు ఒక్కటే టీం అని జగదీశ్ రెడ్డి పవన్ ను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే బిఆర్ఎస్, రేవంత్ ని బాబు శిష్యుడిగా అభివర్ణిస్తుంటే ఇక బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ ని చిట్టి నాయుడు అంటూ సెటైరికల్ గా సంభోదిస్తున్నారు.

ADVERTISEMENT

ఇక ఇప్పుడు వారిద్దరి జోడీలోకి పవన్, మోడీ ని కూడా జత చేసి జగదీశ్ రెడ్డి కొత్త రాజకీయం మొదలుపెట్టారు. పవన్ తెలంగాణలో కొత్తగా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసేదేముంది, ఎప్పటి నుంచో పవన్ ఒక్కడే ఉన్నాడుగా, ఆయన పార్టీ కూడా గతంలో తెలంగాణ ఎన్నికలలో పోటీ చేసి కనీసం డిపాజిట్లు కూడా పొందలేకపోయిందిగా అంటూ వాపోయారు.

అయితే పవన్ విషయంలో జగదీశ్ అనుసరిస్తున్న దూకుడు చూస్తుంటే ఈయన దూకుడు బిఆర్ఎస్ పార్టీ రాజకీయ లబ్ది కోసమా.? లేదా రెడ్డి నాయకుడిగా పొరుగు రాష్ట్రమైన ఏపీలోని రెడ్డి నాయత్వం మెప్పుకోసమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో కూడా జగదీశ్ రెడ్డి పవన్ ను పలుమార్లు కించపరిచేలా వ్యాఖ్యానించారు. ఏపీలో వైసీపీ ఘోర ఓటమికి పవన్ కీలక పాత్ర పోషించడమే సదరు రెడ్డి గారి ఆవేశానికి కారణమా.? లేదా బిఆర్ఎస్ కి వైసీపీ కి ఉన్న రాజకీయ అనుబంధమే జగదీశ్ రెడ్డిని పవన్ పై రెచ్చేపోయేలా చేస్తుందా అన్నది ఇక్కడి ప్రశ్న.

బిఆర్ఎస్ పార్టీకి అనుకూలమైన రాజకీయ ప్రకటనలే పవన్ చేస్తున్న జగదీశ్ రెడ్డి మాత్రం పవన్ కు వ్యతిరేకంగా విరుచుకుపడుతున్నారు వై.? తెలంగాణలో అసలు అస్తిత్వమే లేని జనసేన కోసం పదేళ్లు అధికారంలో ఉన్న ప్రతిపక్ష బిఆర్ఎస్ లో ఈ ఉలికిపాటెందుకు.? ఎవరి కోసం.? కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠం కోసమా.? లేదా రెడ్డి 2.0 కోసమా.?

ADVERTISEMENT
Latest Stories