పవన్‌ కళ్యాణ్‌ని విమర్శిస్తే లోకేష్‌ జవాబు.. భేష్!

Nara lokesh

జగన్‌, పవన్ ఇద్దరూ రాజకీయాలలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నవారే. అయితే ఇద్దరి వ్యక్తిత్వాలలో నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.

జగన్‌ కుట్రలు, కుతంత్రాలతో రాజకీయాలు చేస్తూ ఒక్కసారిగా పైకి ఎదిగి పాతాళానికి పడిపోగా, పవన్ కళ్యాణ్‌ రాజకీయాల కంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, ప్రజల సంక్షేమమే ముఖ్యమని భావించి 2014 ఎన్నికలకు దూరంగా ఉండిపోయి టీడీపీ, బీజేపిలకు మద్దతు ఇచ్చారు.

ADVERTISEMENT

జగన్‌ వైసీపీ అనే వైరస్‌ని రాష్ట్రమంతా వ్యాపింపజేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేస్తే, పవన్ కళ్యాణ్‌ ఆ వైరస్‌కి జనసేన అనే వ్యాక్సిన్ వేసి అరికట్టారు. జగన్‌ ఎన్నికలలో ఒడిపోయినా అహంకారంతో మాట్లాడుతుంటే, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్‌ చేతిలో విశేషాధికారాలు ఉన్నప్పటికీ ఎంతో హుందాగా మాట్లాడుతుంటారు.

జగన్‌ అధికారంలో ఉన్నప్పుడు స్వయంగా తాను, తన పార్టీ నేతల చేత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను, వారి కుటుంబాలలో మహిళలను కించపరుస్తూ మాట్లాడారు. అందుకు ఆగ్రహించిన ప్రజలు 11 సీట్లతో తాడేపల్లి ప్యాలస్‌ నుంచి బయటకు రాకుండా కూర్చోబెట్టినా జగన్‌లో ఆ అహం ఇంకా తగ్గలేదు.

ఈరోజు మీడియా ప్రతినిధి ప్రశ్నకు సమాధానంగా “పవన్ కళ్యాణ్‌ కార్పోరేటర్‌కు ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ.. జీవితంలో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన గురించి ఏం మాట్లాడాలి?” అంటూ జగన్‌ చాలా చులకనగా మాట్లాడారు.

ఈ వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్‌ చాలా తీవ్రంగా స్పందించారు. శాసనసభ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, “అహంకారానికి ఫ్యాంట్, చొక్కా తొడిగితే అది జగన్మోహన్ రెడ్డి.

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, మంత్రిగా ఎంతో సమర్ధంగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్‌ గురించి జగన్‌ ఈవిదంగా మాట్లాడటం ఆయన అహంభావానికి నిదర్శనం.

ఇందుకే ప్రజలు ఆయనకు కనీసం ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఇవ్వలేదు. సొంత తల్లిని, చెల్లినే గౌరవించనివాడు ఇతరులను గౌరవిస్తారని ఎలా అనుకోగలం?

పులివెందుల నుంచి పోటీ చేసిన జగన్‌కు వచ్చిన మెజార్టీ ఎంత?తొలిసారిగా పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్‌ వచ్చిన మెజార్టీ ఎంతో ఆయనకే తెలుసుగా?

జగన్‌ చెప్పిన్నట్లు మా కూటమి ప్రభుత్వం నడుచుకోవాలంటే కుదరదు. ఒకవేళ ఏమైనా చెప్పాలనుకుంటే ధైర్యంగా శాసనసభకు వచ్చి చెపితే మేమూ ఆయనకి తగిన సమాధానం చెపుతాము,” అని మంత్రి నారా లోకేష్‌ అన్నారు.

వైసీపీ నేతలు, వారి సొంత మీడియా పవన్ కళ్యాణ్‌, నారా లోకేష్‌లకు పడటంలేదని, ఇద్దరి మద్య ఆధిపత్యపోరు సాగుతోందని దుష్ప్రచారం చేస్తూ కూటమిలో చిచ్చు పెట్టేందుకు విఫలయత్నాలు చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.

కానీ పవన్ కళ్యాణ్‌ని కించపరుస్తూ జగన్‌ మాట్లాడితే, ఆయనకు మంత్రి నారా లోకేష్‌ ఈవిదంగా సమాధానం చెప్పడం గమనిస్తే వారి మద్య ఎంత బలమైన బంధం ఉందో అర్దమవుతుంది కదా?

ADVERTISEMENT
Latest Stories