ప్చ్… జగన్ మరిచిపోయారు! అభిమానులు నిరాశ!

no chance to ys jaganఏ ప్రెస్ మీట్ అయినా… ఏ బహిరంగ సమావేశం అయినా… జగన్ సాధారణంగా పలికే కొన్ని డైలాగ్స్ ఉంటాయి. అవే… “త్వరలోనే నేను ముఖ్యమంత్రిని అవుతాను… మీ అందరి కష్టాలు తీరిపోతాయి… ప్రతి ముఖంలో చిరునవ్వు వెల్లివిరుస్తుంది..!” బహుశా ఈ మాటలను మరిచిపోయారో లేక తానూ సిఎం కావడం కష్టమని నిజం తెలుసుకున్నారో గానీ… విశాఖ జిల్లా, చింతపల్లిలో జరిగిన బహిరంగ సభలో ‘కాబోయే సిఎం’ అన్న ఊసెత్తకుండా వ్యాఖ్యానించారు. అయితే తమ అధినేత నోటి వెంట ఎలాగైనా ఈ డైలాగ్స్ వినాలని ఆశించిన అభిమానులు నిరాశ చెందారు.

ఈ ప్రసంగంలో మరో ‘ట్విస్ట్’ కూడా ఉంది. ఇటీవల కాలంలో జగన్ ప్రసంగాలు ఎంత ఆసక్తిని రేపుతున్నాయో తెలిసిందే. ఒకే వ్యాఖ్యాన్ని అటు తిప్పి, ఇటు తిప్పి చెప్పిందే చెప్పడం పరిపాటిగా మారిపోయింది. బహుశా ఈ విషయాన్ని కూడా గమనించుకున్నారో ఏమో గానీ, ముందుగా తాను ప్రసంగించకుండా… స్థానికులతో ప్రసంగాలు ఇప్పించారు. అయితే వారంతా వైయస్ హయంలో జరిగిన విషయాల నుండి వస్తుండడంతో ఎలాగైనా చంద్రబాబు పేరు తెప్పించేందుకు స్వయంగా తానే రంగంలోకి దిగి ‘యాంకరింగ్’ లాంటి పాత్ర కూడా పోషించారు.

ఇక, ఆ తర్వాత షరామామూలే! వైయస్ పాలనంతా స్వర్ణయుగం అని, గత 18 మాసాలుగా చంద్రబాబు పాలనపై విమర్శల వాన కురిపించారు. బాక్సైట్ త్రవ్వకాలను ఇన్ని లక్షల గొంతులు వద్దంటున్నాయని చెప్తూ తన గొంతు చించుకుని మరీ వ్యాఖ్యానించారు. అలాగే చంద్రబాబుకు జ్ఞానోదయం కావాలంటూ పెద్ద ఎత్తున ఆదివాసులను ఉత్సాహపరిచే ప్రయత్నం చేసారు.

ఇంతకీ అసలు వాస్తవమేమిటంటే… ఈ బాక్సైట్ త్రవ్వకాలు వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తెర పైకి వచ్చాయి. అప్పుడు విబేధించిన చంద్రబాబు, ప్రస్తుతం ‘గిరిజనులను ఒప్పించి మాత్రమే ముందుకు సాగుతాం’ అంటూ స్పష్టమైన ప్రకటన చేసింది. అలాగే అమలులో ఉన్న జీవోను కూడా రద్దు చేసారు. ప్రస్తుతం బాక్సైట్ త్రవ్వకాలపై స్తబ్ధత నెలకొంది. నిజానికి ఈ సమయంలో జగన్ చేయాల్సిన రగడ కాదని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడ్డారు.

మరి చేయాల్సిన సమయంలో చేస్తే జగన్ స్పెషాలిటీ ఏముంటుందనుకున్నారో ఏమో గానీ బాక్సైట్ త్రవ్వకాల అంశంపై విరుచుకుపడ్డారు. తాజా పరిణామాల బట్టి చూస్తే… జ్ఞానోదయం కావాల్సింది జగన్ కో, చంద్రబాబు కో అర్ధమవుతుందని రాజకీయ విశ్లేషకుల మాట.

ADVERTISEMENT
Latest Stories