కథ…కధనం సెట్ అవ్వాలి కానీ..టాలీవుడ్ హ్యాండ్ సమ్ హీరో కమ్ విలన్ జగ్గూ భాయ్ తెరపైన జీవించేస్తాడు..లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వరుసగా విలన్ పాత్రలు చేస్తున్న జగపతి బాబుకి…అన్ని భాషల్లో మంచి ఆఫర్స్ వచ్చాయి. ముఖ్యంగా తమిళంలో భారీ సినిమాలే వచ్చాయి..అయితే సరైన హిట్స్ లేకపోవడం వల్ల ఆయన పాత్రలు పెద్దగా అట్టెన్షన్ తీసుకోలేదు..
[m9ad]
కానీ ఇప్పుడు మరో మారు అజిత్ “విశ్వాసం”లో తన టాలెంట్ చూపించాడు జగపతి బాబు..తాజాగా విడుదల అయిన ఈ సినిమా ట్రైలర్ లో హీరో కన్నా మంచి స్టైలిష్ గా కనిపించాడు జగపతి బాబు…అయితే ఇది పక్కా మాస్ సినిమా కావడం, ఇక స్టైలిష్ విలన్ గా జగపతి బాబు లుక్ ఉండడంతో ఈ పాత్రపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి..ఈ సినిమా మంచి హిట్ అందుకుంటే..మాత్రం ఈ సినిమాలో జగణపతి బాబు పాత్ర గుర్తు ఉండిపోయే పాత్ర అవుతుంది అని ట్రైలర్ చూస్తేనే అర్ధం అవుతుంది…
ఒక పక్క అజిత్ సినిమాలో నా కధకు నేనే విలన్ అంటూ ఉంటే మరో పక్క జగపతి బాబు నా కధకు నేనే హీరో అంటూ…నిజంగానే హీరో మాదిరి అలరించనున్నాడు…
మరి ఈ సినిమా సక్సెస్ తో జగపతి బాబు కెరీర్ లో మరో గుర్తు ఉండిపోయే పాత్ర ప్రేక్షకులను అలరిస్తుంది అని స్పష్టంగా చెప్పవచ్చు…చూద్దాం మరి ఏం జరగబోతుందో.



