పెద్ది విడుదలై నేటికి సరిగ్గా వారం రోజులవుతుంది. రిలీజ్ కి ముందు ఇండియా మొత్తం తిరిగేసి తెగ ప్రచారం చేసిన చిత్ర బృందం రిలీజ్ తర్వాత మాత్రం ఒక ప్రెస్ మీట్ & ఒక థ్యాంక్యూ మీట్ తో సరిపెట్టుకున్నారు. రిలీజ్ తర్వాత సినిమాని మరింతగా జనాల్లోకి తీసుకెళ్లడంలో మాత్రం రామ్ చరణ్, బుచ్చి బాబు విఫలమయ్యారు. నిజానికి రిలీజ్ తర్వాత కూడా హీరో నుండి పుష్ కావాలి. డైరెక్టర్ & టీమ్ కుదిరితే సింగిల్ స్క్రీన్స్ విజిట్ చేయాలి. అందులోనూ మరో వారం దాకా పెద్ద సినిమాలేమీ పోటీకి లేవు. దాదాపు జూన్ 19 వరకు పెద్ది సినిమాది సోలో గేమ్. ఓపికున్నంత కలెక్ట్ చేసుకోవచ్చు.
అయితే.. సినిమాకి వచ్చిన రెస్పాన్స్ వల్లనో, డివైడ్ టాక్ వల్లనో లేక జాన్వీ క్యారెక్టర్ విషయంలో జరిగిన ట్రోలింగ్ వల్లనో పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ కు కీ టీం మెంబర్స్ అందరూ దూరంగానే ఉన్నారు. ఒక్క జగపతిబాబు మాత్రం ఆ భారాన్ని మోస్తున్నారు. సినిమా రిలీజ్ తర్వాత కూడా ఈవెంట్స్ కి అటెండ్ అవుతూ, పర్సనల్ ఇంటర్వ్యూలు ఇస్తూ “పెద్ది” సినిమాని వీలైనంతగా ప్రమోట్ చేస్తున్నారు.
అలాగని సదరు ఇంటర్వ్యూల్లో సినిమానేం ఆకాశానికి ఎత్తేయడం లేదు, సినిమాలో ఉన్న లోటుపాట్లను ఒప్పుకుని, ఇంకొన్నిట్ని ఆయన కూడా వేలెత్తి చూపి, తన పాత్ర తాలూకు సన్నివేశాల్ని కట్ చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూనే చాలా బ్యాలెన్స్డ్ గా సినిమాని ప్రమోట్ చేస్తూ “పెద్ది” సినిమాకి పెద్ద దిక్కుగా నిలిచారు జగపతిబాబు.
ఒక సీనియర్ & క్రెడిబుల్ యాక్టర్ గా తన ఇమేజ్ కు ఎక్కడా డ్యామేజ్ కానివ్వకుండా జగపతిబాబు మైంటైన్ చేస్తున్న డిగ్నిటీని కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. వృద్ధి సినిమాస్ మరియు బుచ్చిబాబు ఈ విషయమై జగపతిబాబుకు డబుల్ రెమ్యునరేషన్ ఇచ్చినా తప్పులేదు.
#Peddi అనే సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అవుతుందన్నారు…
కానీ ఇప్పుడు #Peddi కి మీరే పెద్ద దిక్కుగా మారి… single handed గా promotions తో push చేస్తున్నారు.#JagapathiBabu pic.twitter.com/2LVzup5F7k
— M9 NEWS (@M9News_) June 11, 2026






