బిగ్ ఫైట్… ఈ నెలలోనే..!

Jai Lava Kusa Vs Spyderదసరా బరిలో జూనియర్ ఎన్టీఆర్ “జై లవకుశ” మరియు ప్రిన్స్ మహేష్ బాబు “స్పైడర్” చిత్రాలు నిలుస్తాయో లేదో ఇప్పుడే చెప్పలేం గానీ, ఈ నెలాఖరుకి మాత్రం ఈ రెండు సినిమాల మధ్య మరో ‘బిగ్ ఫైట్’కు రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది. అవును… ఇప్పటికే సరికొత్త రికార్డులు సాధించిన “స్పైడర్” మరియు “జై లవకుశ” టీజర్లకు కొనసాగింపుగా మరో రెండు టీజర్లు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం.

మురుగదాస్ – ప్రిన్స్ మహేష్ బాబు కాంభినేషన్ లో తెరకెక్కుతోన్న “స్పైడర్” సినిమాకు సంబంధించి మరో టీజర్ రాబోతుందన్న వార్త పాతదే. ఈ సారి సినిమా యొక్క థీమ్ తెలిసే విధంగా ప్రిన్స్ చెప్పే ఓ డైలాగ్ తో ఈ టీజర్ ను కట్ చేయిస్తున్నట్లుగా, తెలుగు, తమిళ భాషల్లో దీనిని విడుదల చేయనున్నారు. ముందుగా మహేష్ పుట్టినరోజు నాడు దీనిని విడుదల చేయాలనుకున్నా, ఈ నెల 20వ తేదీనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట.

ADVERTISEMENT

మరో పక్కన ‘జై’ పాత్రతో సంచలనం సృష్టించిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, ఈ సారి ‘లవ’ పాత్రతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. ఈ నెలాఖరుకి ‘లవ’ పాత్రకు సంబంధించిన టీజర్ ను విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందట. ‘జై’ పాత్రతో వీక్షకులలో వచ్చిన టెంపోను కొనసాగించేందుకు ఈ టీజర్ విడుదలకు ముహూర్తాన్ని ఖరారు చేసినట్లుగా ట్రేడ్ టాక్.

దీంతో మరోసారి యూ ట్యూబ్ లో ప్రకంపనలు చెలరేగడం ఖాయం అంటున్నారు సినీ అభిమానులు. గ్లిమ్స్ ద్వారా ‘స్పైడర్’ సాధించిన రికార్డులను ‘జైలవకుశ’ కొల్లగొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ రికార్డులను మళ్ళీ ‘స్పైడర్’ టీజర్ అధిగమించడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. అదే జరిగితే… మళ్ళీ ‘స్పైడర్’ రికార్డుల వేటలో ‘జై లవకుశ’ పడ్డట్లే! అయితే ఈ ‘బిగ్ ఫైట్’కు అఫిషియల్ ప్రకటన రావాల్సి ఉంది.

ADVERTISEMENT
Latest Stories