భవిష్యత్తు గురించి జానారెడ్డి గారు ‘హింట్?’

jana reddy about warangal electionsవరంగల్ బైపోల్‌లో ప్రధాన పార్టీలకు చుక్కలు చూపిన టీఆర్ఎస్‌కు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మద్దతునిస్తుందా? 2019 ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ పొత్తులైనా వుండవచ్చని కాంగ్రెస్ సీనియర్ నేత, శాసన సభాపక్ష నేత జానారెడ్డి పరోక్షంగా ఈ మేరకు చేసిన తాజా వ్యాఖ్యలు పార్టీల్లో కలకలం రేపుతున్నాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులుగానీ, మిత్రులు గానీ వుండరనే విషయాన్ని ఈ వ్యాఖ్యలు గుర్తు చేస్తున్నాయి.

వరంగల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓటమికి సమిష్టి బాధ్యత వహిస్తామన్న జానారెడ్డి, తమ పార్టీ ప్రచారాన్ని వరంగల్ ఓటర్లు నమ్మలేదన్నారు. ఏదిఏమైనా ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుని ముందుకు సాగుతామన్నారు. ఇక మూడేళ్లలో ప్రాజెక్టుల ద్వారా రెండో పంటకు నీళ్లిస్తే సీఎం కేసీఆర్‌కు తాను ప్రచార సారధిగా పనిచేస్తానన్న సవాల్‌కు కట్టుబడే వున్నానని జానారెడ్డి మరోసారి వ్యాఖ్యానించారు.

ADVERTISEMENT
Latest Stories