ఆదివారం నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన ఒక రోజు దీక్షతో జనసైనికులలో ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ రాష్ట్రంలో చెడ్డి గ్యాంగ్ కు, జగన్ రెడ్డి గ్యాంగ్ కు పెద్ద తేడా ఏం లేదు, ఎందుకంటే చెడ్డి గ్యాంగ్ రాత్రి దోచుకుంటా ఉంటే, జగన్ రెడ్డి గ్యాంగ్ పగలు-రాత్రి కూడా దోచుకుంటున్నారు. రాష్ట్రంలో దోచుకోనిది ఏమైనా ఉందా? అని ఆలోచిస్తే అసలేమీ గుర్తుకు రాని పరిస్థితి నెలకొందని వైసీపీ సర్కార్ తీరుపై తీవ్ర విమర్శలు చేసారు.
చెడ్డి గ్యాంగ్ ఆస్తులు దోచుకుంటుంటే, వీళ్ళు భూములు, మైన్స్, ఇసుక, స్థలాలు, పొలాలు దోచుకుంటున్నారు, వీటితో పాటుగా పేద ప్రజలకు ఇచ్చినటువంటి ఇళ్ల మీద కూడా ‘వన్ టైం సెటిల్మెంట్’ ద్వారా 10 వేల కోట్లు దోచుకుంటున్నారు. ఈ ఓటీఎస్ 39 లక్షల మంది పేద ప్రజల కోసం కాదని, 10 వేల కోట్ల రూపాయలు జగన్ మోహన్ రెడ్డి దోచేయడానికి అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేస్తే, దానిని విజయసాయి రెడ్డి ద్వారా ‘క్విడ్ ప్రో’ క్రింద మళ్ళీ చేజిక్కించుకుని వ్యాపారం చేయాలని జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారని, ఇప్పటికే భారతి సిమెంట్ ద్వారా సిమెంట్ అమ్ముకుంటున్నారని, అలాగే ఇసుక దోపిడీ చేస్తున్నారని, ఇలా మొత్తంగా వ్యాపార దృక్పధం తప్ప విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడేందుకు ఒక్క లేఖ తప్ప ఏం చేయలేదని వ్యాఖ్యానించారు.
పెట్టుబడుల ఉపసంహరణ జరగకూడదంటే, ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవం నిలబడాలన్నా పవన్ కళ్యాణ్ పోరాటం ఒక్కటే మార్గం. నాడు పిలుపిస్తే విశాఖలో జనం వచ్చిన తీరుకు వైసీపీ సర్కార్ భయబ్రాంతులకు గురైందని పోతిన వెంకట మహేష్ చేసిన ఈ వ్యాఖ్యలు జన సైనికులలో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నాయి. దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియోలను షేర్ చేసుకుంటూ సందడి చేయడం జనసేన అభిమానుల వంతవుతోంది.
రాష్ట్రంలో చెడ్డీ గ్యాంగ్ కు, @ysjagan గారి గ్యాంగ్ కు తేడా లేదు. వారు రాత్రి దోచుకుంటుంటే, జగన్ రెడ్డి గ్యాంగ్ పగలు,రాత్రి దోచుకుంటున్నారు – @JanaSenaParty విజయవాడ నగర అధ్యక్షులు శ్రీ @JSPpvmahesh గారు. @JSPShatagniTeam @JSPVijayaWest#JSPSangheebhavaDeeksha pic.twitter.com/jCkmT8K5Pm
— हेम कुमार मुनिकोटी (@JSPHemu) December 12, 2021
భారతి సిమెంట్ అమ్మినట్టు .. స్టీల్ ప్లాంట్, ఇసుకను అమ్ముతున్నాడు _ @JanaSenaParty విజయవాడ నగర అధ్యక్షులు @JSPpvmahesh గారు @JSPShatagniTeam @JSPVijayaWest pic.twitter.com/6DxacyTF5S
— हेम कुमार मुनिकोटी (@JSPHemu) December 12, 2021



