జనసేన కాదు కాపుసేన

janasena-party-filled-with-kapu-casteజనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన ‘జనసేన పోరాట యాత్ర’ లో టీడీపీనే టార్గెట్ గా ఆరోపణలు సంధిస్తున్నారు. తాను గెలవకపోయినా తెలుగు దేశాన్ని ఓడించడం ఖాయం అని ఆయన ఇప్పటికే చెప్పేసారు. అయితే చంద్రబాబు మాత్రం పవన్ కళ్యాణ్ పై స్పందించడానికి కొంత ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది.

అయితే సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్లు మాత్రం జనసేనానిని వదిలిపెట్టడం లేదు. కులరహిత సమాజం అంటూ పెద్ద పెద్ద మాటలు చెబుతున్న పవన్ కళ్యాణ్ కు వారు పెద్ద పంచే వేస్తున్నారు. జనసేన పార్టీ నాయకుల నుండి జిల్లా ఇంచార్జిల వరకు ఉన్న నాయకుల లిస్టు బయటకు తీశారు.

ADVERTISEMENT

ఆశ్చర్యకరంగా లిస్టులో ఉన్న వారందరూ కాపు కులస్థులు కావడంతో జనసేన అభిమానులు ఇబ్బంది పడుతున్నారు. ఆ పోస్టులను సోషల్ మీడియాలో తిప్పుతూ తెలుగు తమ్ముళ్లు జనసేనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. కొందరైతే ఈ సమస్య మీడియాకు ఎక్కకముందే సరిచేయాలని పార్టీ నాయకులకు చెబుతున్నారంట. జనసేన గురించి సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్లు చేస్తున్న ఆరోపణ ఇదే:

Janasena Party filled with Kapu caste

ADVERTISEMENT
Latest Stories