రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనేదానికి తాజగా ఘటనే ప్రత్యక్ష ఉదాహరణగా నిలవనుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో కి వచ్చిన తొలినాళ్ళల్లో సీఎం రేవంత్ ను ఆకర్షించే ప్రక్రియలో భాగమో, లేదా మీడియాలో తన పేరు ప్రచారంలో ఉండాలన్న ఆశో లేదా కేటీఆర్ మీదున్న పాత లెక్కల సర్దుబాటులో భాగమో తెలియదు కానీ సురేఖ కేటీఆర్ టార్గెట్ గా కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన మాట వాస్తవం.
అందుకు కేటీఆర్ హర్ట్ అయ్యి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన మాట వాస్తవమే. అయితే అప్పుడు తానూ చేసిన వ్యాఖ్యలకు సురేఖ ఇప్పుడు బాధపుతుండడమే ఇక్కడ కొసమెరుపు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటూనే సీఎం రేవంత్ టార్గెట్ గా సురేఖ కుటుంబం నడిపిన రాజకీయానికి సురేఖ తన మంత్రి పదవిని కోల్పోయి భారీ మూల్యమే చెల్లించింది.
ఒక బీసీ మహిళనైనా తననూ మంత్రి పదవి నుంచి తొలగించిన కాంగ్రెస్ పార్టీ నుంచి కొండా సురేఖ కుటుంబ సమేతంగా పార్టీ మారబోతున్నారని అప్పుడే గుసగుసలు వినిపించాయి. అయితే గతంలో సురేఖకు కేటీఆర్ పై వ్యక్తిగత విమర్శలు చేసిన చరిత్ర ఉన్న నేపథ్యంలో సురేఖ గులాబీ కారు ఎంట్రీ అంత ఈజీ కాదు అనేది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారమైన వార్త.
అలాగే ఇటు టి.బీజేపీ సైతం కాంగ్రెస్ ఉన్న వేస్ట్ ని మా పార్టీలోకి తీసుకునేది లేదంటూ నిర్మొహమాటంగా తేల్చి చెప్పడంతో సురేఖ జెండా మార్పు కాస్త సంకటంలో పడినట్టయ్యింది. దీనితో కొన్నాళ్ళు పొలిటికల్ గా సైలెంట్ అయిన సురేఖ అండ్ ఫ్యామిలీ తాజాగా సోషల్ మీడియా పోస్ట్ తో మరోసారి వార్తలలో నిలిచారు.
గతంలో కేటీఆర్ పై తానూ చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నా అంటూ మాజీ మంత్రి కొండా సురేఖ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. దీనితో కొండా కుటుంబం పార్టీ మారబోతుందా.? అందులో భాగమే ఈ పశ్చాత్తాప పోస్టా.? ఒకవేళ కొండా సురేఖ పార్టీ మార్పు జరిగితే కేటీఆర్ వదిలిన బాణంలా రేవంత్ ను పొలిటికల్ గా టార్గెట్ చెయ్యడం ఖాయంగా కనపడుతుంది.
అయితే కొండా సురేఖ తానూ బిఆర్ఎస్ ఎంట్రీ కోసం ఎదురుచుస్తున్నా అన్నట్టుగా చేస్తున్న ఈ సంకేతాలు బిఆర్ఎస్ ని ఆకర్షించగలవా.? గతం గతః అని అన్ని మరిచిపోయి బిఆర్ఎస్ అధినాయకత్వం సురేఖ కుటుంబం కోసం గులాబీ కారు డోర్స్ ఓపెన్ చెయ్యగలవా.?
బిఆర్ఎస్ క్యాడర్ కొండా సురేఖ బిఆర్ఎస్ ఎంట్రీని ఆమోదించగలరా.? ఒకవేళ కేసీఆర్ రాజకీయాల్లో ఇవన్నీ సర్వ సహజం అని పెద్దమనసు చేసుకుని కొండా సురేఖను పార్టీలోకి స్వాగతిస్తే కేటీఆర్ ఆమెతో కలిసి పని చెయ్యగలరా.? అదే జరిగితే బిఆర్ఎస్ కొండా ఎంట్రీ పై ప్రత్యర్థుల నుంచి అనేక ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తుంది.





