‘జనతా గ్యారేజ్’ లుక్ లో తారక్ ఫ్రెష్ ఫోటోస్!

janatha garage ntr new lookజూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన “జనతా గ్యారేజ్” ఫస్ట్ లుక్ పోస్టర్స్ ‘బుడ్డోడు’ అభిమానులతో పాటు అందరినీ అలరించాయి. ‘నాన్నకు ప్రేమతో’ లుక్ ను పూర్తిగా కొరటాల శివ మార్చివేయడంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. దీంతో తొలి టీజర్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న సమయంలో… ‘జనతా గ్యారేజ్’ సెట్స్ పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో దిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

అభిమానులతో ఆప్యాయంగా నవ్వుతూ దిగిన ఫోటోలలో జూనియర్ అదిరిపోయే లుక్ లో ఉండడంతో ‘జనతా గ్యారేజ్’పై అంచనాలు అంతకంతకూ రెట్టింపవుతున్నాయి. ‘శ్రీమంతుడు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తోలి టీజర్ ను ఈద్ సందర్భంగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. షూటింగ్ అంతా పక్కా ప్రణాళిక ప్రకారమే జరుగుతుండడంతో అనుకున్న సమయానికే గ్యారేజ్ విడుదల అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ADVERTISEMENT

జూనియర్ ఎన్టీఆర్ సరసన సమంత నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, ‘శ్రీమంతుడు’ సినిమా నిర్మాతలే ‘జనతా గ్యారేజ్’ను కూడా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ… ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు. ఇప్పటికే మహేష్, జూనియర్ ఎన్టీఆర్ లతో సినిమాలు చేసిన ఈ నిర్మాణ సంస్థ లైన్ లో పవన్, ప్రభాస్ లు కూడా ఉన్నారని ట్రేడ్ వర్గాల టాక్.

ADVERTISEMENT
Latest Stories