ఏదో క్యాజువల్ గా అన్న మాటను సీరియస్ గా తీసుకుంటే ఎలా పూరి గారూ?

Janhvi Kapoor says no to puri Jagannadhసహజంగా హీరో హీరోయిన్లు ఇంటర్వ్యూలలో వేరే హీరోల గురించో లేక హీరోయిన్ల గురించో అడిగినప్పుడు ఏదేదో చెబుతూ ఉంటారు. కొందరు హీరోయిన్లు పలానా హీరోతో నటించాలని ఉందని రొటీన్ గా అనేస్తారు. అదే పెద్ద హీరోయిన్లు ఆ మాట అంటే అది సీరియస్ గా అన్నదని అనుకోవడానికి లేదు. మొన్న ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో శ్రీదేవి కూతురు, జాన్వీ కపూర్ తనకు విజయ్ దేవరకొండ అంటే ఇష్టమని, అతనితో కలిసి నటించాలని ఉందని చెప్పుకొచ్చింది.

దానిని సీరియస్ గా తీసేసుకుని జాన్వీ కపూర్ దగ్గర వాలిపోయాడు పూరి జగన్నాధ్. అయితే పూరి ఖంగుతినేలా నో చెప్పేశారట బోణి కపూర్. పూరి సినిమాలు గతంలో తానూ చాలా చూశానని, ఆయన హీరోయిన్లను చూపించే విధానం తనకు నచ్చదని సన్నిహితులతో చెప్పాడట ఆయన. ఈ సినిమాకు ఫైటర్ అనే పేరు ఖరారు చేసినట్టు సమాచారం. ఈ టైటిల్ ను తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ కూడా చేశారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నత్తి సమస్యతో ఉన్న కుర్రాడిగా కనిపించబోతున్నట్లు చెప్తున్నారు.

ADVERTISEMENT

విజయ్ కు ప్రస్తుతం క్రాంతి మాధవ్ తో ఒక సినిమా ఉంది. అలాగే హీరో అనే బైలింగ్వల్ సినిమా ఉంది. ఈ రెండు సినిమాలు పూర్తి చేసి వచ్చే ఏడాది జనవరిలో ఫ్రెష్ గా పూరి సినిమాలు మొదలు పెట్టబోతున్నాడట విజయ్. వరుస పరాజయాలతో సతమతం అవుతున్న ఈ యువ హీరో ఈ సినిమా మీద భారీ ఆశలే పెట్టుకున్నాడు. పూరి కూడా చాలా కాలం తరువాత వచ్చిన సక్సెస్ ని ఈ సినిమాతో కూడా కొనసాగించాలని పట్టుదలగా ఉన్నాడు. చూడాలి ఏం జరగబోతుందో!

ADVERTISEMENT
Latest Stories