ప్రిన్స్ మహేష్ బాబు “శ్రీమంతుడు” సినిమాలో సూపర్ హిట్ సాంగ్ ‘జత కలిసే’ పేరుతో రాబోతున్న సినిమా ఆడియో దర్శక ధీరుడు రాజమౌళి చేతుల మీదుగా విడుదలైంది. ప్రముఖ యాంకర్ ఓంకార్ సోదరుడు అశ్విన్ హీరోగా నటిస్తుండగా, తెలుగు భామ ‘ఐస్ క్రీం’ ఫేం తేజస్వి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను వారాహి ఎంటర్ టైన్మెంట్ వారు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా విడుదలైన ధియేటిరికల్ ట్రైలర్ లో చివరి సన్నివేశం వీక్షకులను ఆలరిస్తోంది.
ప్రేమకధా చిత్రంగా రూపుదిద్దుకున్న “జత కలిసే” ట్రైలర్ లో “శ్రీమంతుడు వర్సెస్ గబ్బర్ సింగ్” ఎపిసోడ్ హైలైట్ కానుంది. ‘శ్రీమంతుడు’గా కమెడియన్ సప్తగిరి నటించగా, ‘గబ్బర్ సింగ్’ గెటప్ లో షకలక శంకర్ కనిపించాడు. ‘శ్రీమంతుడు’ సినిమాలో మామిడి తోట ఫైట్ నేపధ్యంలో తీసిన ఈ ఎపిసోడ్ లో ‘బెంగాల్ టైగర్’లో రవితేజ – పృథ్వీల మధ్య ‘చిటికెల’ మేనరిజంను కూడా వాడేసారు. ట్రైలర్ లో కాస్త టచ్ చేసి వదిలిన ఈ సీన్ ఫుల్ ఎపిసోడ్ చూడాలంటే ఈ నెల 25వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.





