దేవుడా… ఏంటి ఈ రాజకీయ ప్రచారం..?

Jaya Lalitha maniaకాదేది ప్రచారానికనర్హం… అంటున్నారు రాజకీయ నేతలు. ముఖ్యంగా తమిళనాట ఎన్నికల ప్రచారంలో చోటు చేసుకుంటున్న సంఘటనలు ప్రజలను వింత అనుభవాలను పంచుతోంది. ఇప్పటికే తమిళనాడు ‘అమ్మ’కు పార్టీ నేతలు వొంగి వొంగి సలాం కొడుతున్న ఫోటోలు సోషల్ మీడియాల వేదికగా ఓ రేంజ్ లో సర్క్యులేట్ అవుతుండగా, తాజాగా మహిళలు చెవులకు ధరించే దుద్దులకు కూడా ‘అమ్మ’ జయలలిత ఫోటోలు ఉండడం విశేషం.

ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్ తదితర సోషల్ మీడియాలలో వీటికి సంబంధించిన ఫోటోలు హల్చల్ చేస్తూ వీక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. అయితే ఈ తరహా రాజకీయ ప్రచారం మరీ ఓవర్ గా ఉందంటూ చేస్తున్న కామెంట్లు, వేస్తున్న సెటైర్లకు కూడా సోషల్ మీడియానే వేదిక అవుతోంది. దీంతో ఏముంది… ఇక, మున్ముందు మరిన్ని వింత సంఘటనలు చూడాలో ఏంటో..!

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories