టీజర్ టాక్ – ఈ ‘బాబు’ను భరించగలమా?

Jayadev Telugu Teaser Talkఇండస్ట్రీలోకి వస్తున్న వారసుల సంఖ్య లెక్కపెట్టలేనిదిగా తయారైంది. అయితే ఈ సారి ఓ రాజకీయ నాయకుడు కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా ప్రముఖ దర్శకుడు జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించిన “జయదేవ్” ఫస్ట్ టీజర్ ప్రేక్షకులను పలకరించింది. అయితే ఫస్ట్ లుక్ లో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ‘జయదేవ్’ పూర్తిగా విఫలమయ్యాడు.

‘ఈశ్వర్’ చిత్రం ద్వారా ప్రభాస్ ను తెలుగు తెరకు పరిచయం చేసిన కాంభినేషన్ జయంత్ – అశోక్ కుమార్ లే గంటా శ్రీనివాసరావు కొడుకు రవిని కూడా పరిచయం చేస్తున్నారు. పరిచయం చేస్తున్న హీరోకు ఇవ్వాల్సిన బిల్డప్ లను దర్శకుడు జయంత్ ఇచ్చినప్పటికీ, ఒక హీరోగా గంటా రవికి ఉండాల్సిన లుక్స్ మాత్రం లేవనే చెప్పాలి. ముఖ్యంగా డబ్బింగ్ సినిమాల హీరో మాదిరి కనిపిస్తుండడం ప్రేక్షకులను ఎంతవరకు చేరువ చేస్తుందో చూడాలి.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories