విడాకుల విషయంలో బరస్ట్ అయిన హీరో

Jayam Ravi Emotional Press Meet Shocks Fans

జయం రవి విడాకుల వార్త యావత్ సౌత్ స్టేట్స్ అన్నీ డిస్కస్ చేసుకున్నాయి. ముందుగా జయం రవి తన భార్య ఆర్తి నుండి విడాకులు ప్రకటించగానే.. అసలు నాకు చెప్పనేలేదు అని ఆర్తి రవి స్టేట్మెంట్ ఇవ్వడం, ఈ హడావుడి మొత్తం సర్దుమణగక ముందే తన గర్ల్ ఫ్రెండ్ కెనిషాతో జయం రవి ఓ పెళ్ళికి అటెండ్ అవ్వడం అనేది పెను దుమారం రేపింది. ఇంకా విడాకులు తీసుకోకుండానే రవి-కెనిషా కలిసి ఉంటున్నారనే విషయం జనాల్లోకి వెళ్లిపోయింది.

అయితే.. నిన్న సడన్ గా కెనిషా “నేను రవిని వదిలేస్తున్నా” అంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టడం అనేది సంచలనం సృష్టించింది. అప్పుడే ఎలా విడిపోతారు? ఎందుకు విడిపోయారు? వంటి ప్రశ్నలు తలెత్తాయి. ఈ క్రమంలో కెనిషా ఓ వీడియో స్టేట్మెంట్ లో ఆర్తీ రవిపై స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వడం చర్చనీయాంశం అయ్యింది.

ADVERTISEMENT

ఈ క్రమంలో సడన్ గా జయం రవి అలియాస్ రవి మోహన్ ఒక ప్రెస్ మీట్ పెట్టి తన బాధను, కోపాన్ని నిర్మొహమాటంగా వెళ్లగక్కాడు. ముఖ్యంగా ఆర్తి క్యారెక్టర్ గురించి, ఆమె అతడ్ని వేధించిన తీరు గురించి కళ్ల వెంబడి నీళ్లు వచ్చేలా చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా ఫైనాన్షియల్ గా తాను ఎంత ఇబ్బందిపడుతున్నాడో రవి చెప్పిన తీరు ఆశ్చర్యం కలిగించింది. అసలు తనకు సపరేట్ ఎకౌంట్ కూడా లేదని చెప్పుకొచ్చాడు.

అన్నిటికీ మించి తాను ఈ ప్రెజర్ భరించలేక సూసైడ్ కూడా చేసుకోబోయానని, ఈ గొడవలన్నీ సర్దుమణిగేదాకా తన సినిమాలేవీ రిలీజ్ అవ్వవని, ఈ గొడవ క్లియర్ అయ్యాకే నటన మీద కాన్సన్ ట్రేట్ చేస్తానని రవి వివరించాడు. మరి ఇప్పుడు ఆర్తి రవి ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుంది అనేది చూడాలి. ఇకపోతే.. ఆర్తి రవికి తమిళ నటి మరియు రాజకీయ నాయకురాలు ఖుష్బూ కూడా తోడుగా నిలవడం గమనార్హం.

ADVERTISEMENT
Latest Stories