క్లైమాక్స్ లో సెంటిమెంట్ ను పిండేసిన బన్నీ!

jio filmfare awards 2017 condolence to Dasari Narayana2016 సంవత్సరానికి గానూ ‘ఉత్తమ నటుడు’ విభాగంలో జూనియర్ ఎన్టీఆర్ ఎంపిక కావడంతో, నిరుత్సాహపడిన మెగా అభిమానులను కాసేపటికే ఫిల్మ్ ఫేర్ విభాగం మరో కోణంలో సంతృప్తి పరచడం విశేషం. విమర్శకులు మెచ్చిన ‘ఉత్తమ నటుడు’గా అల్లు అర్జున్ ను ఎంపిక చేసి అవార్డు ఇవ్వడం ఊహించని పరిణామంగా మారింది. అయితే బన్నీకి కూడా ‘బెస్ట్ యాక్టర్’ అవార్డు రావడంతో అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.

ఈ అవార్డు స్వీకరించడానికి విచ్చేసిన బన్నీ… తన మార్క్ స్పీచ్ తో ఆడిటోరియంలో ఉన్న వారందరినీ రెండు నిముషాల పాటు నిల్చోబెట్టిన ఘనతను సొంతం చేసుకున్నాడు. అవును… టాలీవుడ్ లెజెండరీ దర్శకుడు ‘దర్శకరత్న’ దాసరి నారాయణరావు ఇటీవల కాలం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ… ఈ అవార్డును దాసరికి అంకితం చేస్తున్నానని ప్రకటించడంతో ఆడిటోరియంలోని వారంతా నిల్చుని బన్నీకి అభివాదాలు పలికారు.

ADVERTISEMENT

ఈ వేడుక మొత్తంలో ‘పెద్దాయన’ దాసరిని తలచుకున్న ఒకే ఒక్క వ్యక్తిగా బన్నీ నిలవడం విశేషం. ఆకట్టుకునే ప్రసంగాలలో మెగా హీరోలు ఎంతైనా దిట్ట అని ఉరకనే చెప్పరు కదా! అంతకుముందు వరకు దాసరి గురించి ఎవరూ ప్రస్తావించకపోవడం… బన్నీ ఒక్కసారిగా గుర్తు చేయడంతో… బన్నీ స్పీచ్ కు స్టాండింగ్ ఒవేషన్ వచ్చింది. మరి దాసరి గారు చూసారో లేదో గానీ… బన్నీ మాత్రం క్లైమాక్స్ లో సెంటిమెంట్ ను పిండేసాడు..!

ADVERTISEMENT
Latest Stories