తెలుగు, తమిళ భాషల్లో ఎలాంటి చిత్రాలలో నటించినప్పటికీ, బాలీవుడ్ లో మాత్రం ఎంతటి వారైనా గ్లామర్ షో చేయాల్సిందే. కెరీర్ మొదట్లో అందాల ప్రదర్శనకు సోనం కపూర్ అభ్యంతరాలు చెప్పింది కాబట్టే అవకాశాలు అంతంత మాత్రం వరించాయి. అయితే, ఒక్కసారి ఆ హద్దులు చెరిపేసిన తర్వాత కనీసం ఏడాదికి ఒకటి, రెండు సినిమాలతో సోనం ప్రేక్షకులకు ఆకట్టుకుంటోంది. అలా హీరోల కూతుళ్ళు, స్టార్ హీరోల భార్యలు అన్న తారతమ్యం లేకుండా బాలీవుడ్ లో అందాల ప్రదర్శన చేస్తేనే అవకాశాలు ఎగురుకుంటూ వస్తాయి.
ఈ విషయాన్ని మన కమల్ కూతురు శృతిహాసన్ బాగానే ఒంట పట్టించుకుందో ఏమో గానీ మొదటి చిత్రం “లక్కీ” నుండే అందాల ప్రదర్శనలకు తెరలేపింది. అయితే తొలుత సక్సెస్ లేక ఆశించిన మేరకు అవకాశాలు లేకపోయిన శృతికి ఇటీవల వరుసగా బాలీవుడ్ సినిమాలు దక్కుతున్నాయి. తాజాగా జాన్ అబ్రహం సరసన “రాకీ హ్యండ్సమ్” సినిమాలో నటించిన శృతిహాసన్, ఈ సినిమాలో ఓ రేంజ్ లో అందాల ప్రదర్శన చేసినట్లుగా కనపడుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ‘రెహనుమా…’ అనే మెలోడీ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
జాన్ అబ్రహంతో కలిసి ఉన్న ఈ పాటలో శృతి గ్లామర్ షో అభిమానులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా పింక్ కలర్ ఫ్రాక్ లో బీచ్ ఒడ్డున శృతి కన్నుల పండుగగా దర్శనమిచ్చింది. అలాగే అబ్రహంతో కలిసి పాల్గొన్న శృంగార సన్నివేశాలు కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి. శ్రేయా గోషాల్ ఆలపించిన ఈ పాట ఇప్పటికే ఆడియో పరంగా బాలీవుడ్ వర్గాల్లో సందడి చేస్తోంది. తాజాగా వీడియో కూడా తోడయ్యింది..!



