వైసీపీ ఆశల పై పవన్ ‘పసుపు’ నీళ్లు చల్లారా.?

Pawan Kalyan Alliance Unity

స్థానిక ఎన్నికలు టీడీపీ, జనసేన మధ్య రాజకీయ చిచ్చుకి కారణంగా మారతాయని, ఆ మంటలో తాము చలి కాచుకుందామని వైసీపీ ఎన్నో కలలు కనింది, మరెన్నో ఆశలను పెంచుకుంది. అయితే వైసీపీ నేతల ఆ ఆశలకు ఒకరకంగా పవన్ కూడా కారణమనే చెప్పాలి.

స్థానిక ఎన్నికలలో టీడీపీ, జనసేన మధ్య అవసరమైతే ఫ్రెండ్లీ పోటీ అంటూ పవన్ చేసిన ఆ ఒక్క ప్రకటన కూటమిలో చీలిక అంటూ ఏళ్ళ తరబడి వైసీపీ చేస్తున్న నిరీక్షణకు, అలుపెరుగని యుద్దానికి ఒక ఉత్సహాన్ని ఇచ్చిందనే చెప్పాలి. దానికి తోడు టీడీపీ తమ్ముళ్లు, జనసైనికులు సోషల్ మీడియాలో మొదలుపెట్టిన ఆధిపత్య యుద్ధం కూడా వైసీపీ శ్రేణులకు కాస్త టానిక్ లా పనిచేసింది.

ADVERTISEMENT

దీనితో ఇక ఈ రెండు పార్టీల మధ్య రాజకీయ విభేదాలు తధ్యమని, పొత్తు రద్దు ఖాయమని, ఇక త్వరలో పవన్ తన డిప్యూటీ సీఎం పదవికి కూడా రాజీనామా అంటూ జరుగుతున్న ప్రచారం కార్యరూపం దాల్చడమే ఆలస్యమని ఇలా ఏవేవో కలలు కన్నారు.

ఇక వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏకంగా వైసీపీ 2.0 లో తానూ మొదటి ఆరు మాసాలకు హోమ్ మంత్రి అంటూ పదవుల పంపకాలు కూడా మొదలుపెట్టేసారు. టీడీపీ క్యాడర్ ముసుగులో జనసేన శ్రేణులను, జనసైనికుల పరదాలో పసుపు తమ్ముళ్ళని టార్గెట్ చేస్తూ క్షణికానందం అనుభవించారు.

కానీ కట్ చేస్తే నేడు సీఎం బాబు, డిప్యూటీ సీఎం పవన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ముగ్గురు తమ తమ పార్టీల అధినేతలుగా ప్రజల ముందుకొచ్చి కూటమి అభ్యర్థుల గెలుపు కోసం మూడు పార్టీల లీడర్లు, క్యాడర్లు కలిసి ముందుకెళ్లాలని, లేని పక్షంలో చర్యలుంటాయంటూ మూడు పార్టీల శ్రేణులకు హెచ్చరికలు పంపారు.

ఇక ముఖ్యంగా పవన్ చేసిన కొన్ని ప్రకటనలు వైసీపీ ఆశల పై ‘పసుపు’ నీళ్లు జల్లాయనే చెప్పాలి. జగన్ 2.0 చూపిస్తే ఎన్డీయే 10X చూపిస్తుందంటూ వైసీపీ శ్రేణులపై కౌంటర్ ఎట్టాక్ చేసారు. అలాగే టీడీపీ, జనసేనను రాజకీయంగా ఎదగనివ్వకుండా తొక్కేస్తుందంటూ వైసీపీ, జనసేన మీద చూపిస్తున్న సానుభూతికి కూడా పవన్ తనదయిన స్టైల్ లో రిప్లై ఇచ్చారు.

జనసేన ఒక్క రాత్రిలో ఎదిగిపోయే పార్టీ కాదని, పార్టీ రాజకీయంగా గ్రౌండ్ స్థాయి వరకు వెళ్లాలంటే దశాబ్దాల సమయం పడుతుందని, తానూ జనసేన పార్టీ స్థాపించినప్పుడే నాతో రాజకీయ ప్రయాణం అంటే 25 ఏళ్ళు అని ముందే చెప్పమంటూ, నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న రాజకీయ నేతగా సీఎం బాబు తమను ఎన్నడూ తూలనాడడం కానీ తక్కువ చేసి చూడడం కానీ లేదంటూ కుండబద్దలు కొట్టారు.

దీనితో ఈ స్థానిక ఎన్నికలలో ఈ రెండు పార్టీల మధ్య మొదలైన సీట్ల పంచాయితీ అయినా టీడీపీ నుంచి జనసేనను వీరు చేస్తుందని, తద్వారా వైసీపీ రాజకీయంగా లబ్ది పొందుతుందని వైసీపీ కన్న కలల పై మిత్రధర్మమానికే ఓటేసి పవన్ ‘గాజు గ్లాసులో పసుపు’ నీళ్లు చల్లారు, వైసీపీ సోషల్ మీడియా సైన్యం చెవిలో ‘కాషాయ కమలం’ పెట్టారనే భావన కలుగుతుంది.

ADVERTISEMENT
Latest Stories