ఎన్టీఆర్, రామ్ చరణ్ రికమండేషన్ ఉందంట అతనికి

JR NTR and Ram Charan Recommends Jani Master for RRR Movieతెలుగు చిత్ర పరిశ్రమలో ఉత్తమ డాన్సర్లలో ఎన్‌టిఆర్, రామ్ చరణ్ ఇద్దరు. రాజమౌళి తన మల్టీ స్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ లో వారిద్దరిపై ఒక పాటను ప్లాన్ చేస్తున్నారు. ఈ పాట కోసం స్టెప్స్ కంపోజ్ చెయ్యడానికి ఈ ఇద్దరు స్టార్స్ జానీ మాస్టర్‌ను సిఫారసు చేసినట్లు సమాచారం. ఆయన ఇప్పటికే ఈ పాట కోసం పనిచేయడం ప్రారంభించాడు.

ADVERTISEMENT

దీనిని చివరిలో షూట్ చెయ్యనున్నట్టు సమాచారం. మరోవైపు, మేకర్స్ ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర యొక్క స్పెషల్ వీడియోను గత నెలలో అతని బర్త్ డే స్పెషల్ గా విడుదల చేశారు. ఈ వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది. దీనితో ఈ చిత్రం యొక్క హైప్ మరియు అంచనాలను భారీగా పెరిగిపోయాయి.

మరోవైపు ఎన్టీఆర్ పుట్టినరోజు స్పెషల్‌గా మే 20 న విడుదల కానున్న కొమరం భీమ్ స్పెషల్ వీడియోపై అందరి దృష్టి ఉంది. నందమూరి అభిమానులు మే 20 కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.ఈ చిత్రం జనవరి 8, 2021న సంక్రాంతి సందర్భంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. 4

అయితే కరోనా లొక్డౌన్ వల్ల సినిమా 2021 సమ్మర్ కు వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ఈ ఏడాది చివరి నుండి వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల అయ్యే సినిమాల రిలీజ్ డేట్లలో భారీగా మార్పులు ఉండే అవకాశం ఉంది. చూడాలి ఏం జరుగుతుంది అనేది!

ADVERTISEMENT
Latest Stories