జూనియర్ ఎన్టీఆర్ వెనుక ఆ స్టార్ హీరోల స్కెచ్!

JR NTR Big Boss Show‘బిగ్ బాస్’ షోను హోస్ట్ చేస్తూ బుల్లితెరపై జూనియర్ ఎన్టీఆర్ సందడి చేయబోతున్నారన్న వార్త ఒక్కసారిగా ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. చడిచప్పుడు లేకుండా ఈ న్యూస్ విడుదల కావడంతో, అభిమానులు కూడా షాక్ కు గురయ్యారు. ఇప్పటివరకు తెలుగు బుల్లితెరపై నాగార్జున, చిరంజీవిలు మాత్రమే సందడి చేసారు. నాగ్ షో ‘సూపర్ హిట్’ కాగా, మెగాస్టార్ ది ‘యావరేజ్’ టాక్ తో సరిపెట్టుకుంది. అందులోనూ వీరిద్దరూ తల పండిపోయిన హీరోలు కావడం విశేషం.

కానీ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో అలా కాదు. పడి లేచిన కెరటంలా సిల్వర్ స్క్రీన్ పై దూసుకెళ్తున్నాడు. మరి ఇలాంటి సమయంలోనే బుల్లితెరకు పరిచయం కావడం అంటే కాస్త రిస్క్ తో కూడుకున్న పనిగానే భావించవచ్చు. ఒకవేళ సూపర్ హిట్ అయితే అంతా ప్రశంసలు లభిస్తాయి, కానీ ప్రేక్షకుల ఆదరణకు నోచుకోకపోవడం అనేది జరిగితే, జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ కు వచ్చే ప్రమాదం ఏమీ లేకపోయినా, ఇమేజ్ కు డ్యామేజ్ అయితే జరిగే సంకేతాలు కనపడుతున్నాయి.

ADVERTISEMENT

అసలు ఈ షోకు జూనియర్ ఎన్టీఆర్ సరైన హీరో అని ప్రతిపాదించింది ఎవరు? అంటే… తాజాగా ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం… ‘స్టార్ మా’లో వాటాలు ఉన్నటువంటి ఇద్దరు స్టార్ హీరోలు నాగార్జున, చిరంజీవిలేనన్న టాక్ హల్చల్ చేస్తోంది. ప్రస్తుత హీరోలలో మంచి వక్త ఎవరు అంటే… ఒక్క జూనియర్ ఎన్టీఆర్ తప్ప మరో ఆప్షన్ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. సమయస్పూర్తిగా ఎవరినీ నొప్పించకుండా వ్యాఖ్యానించడం జూనియర్ సొంతం అన్న విషయం ఇప్పటికే నిరూపణ అయిన అంశం.

దీంతో చిరంజీవి, నాగార్జునలు చేసిన ప్రతిపాదనలతో సదరు కార్యక్రమ నిర్వాహకులు జూనియర్ ఎన్టీఆర్ ను సంప్రదించడం, దానికి ఓకే చెప్పడం వెంటవెంటనే జరిగిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమం షూటింగ్ మాత్రం హైదరాబాద్ లో కాకుండా ముంబైలోనే జరపనున్నారని సమాచారం. దీనికి సంబంధించిన సెట్టింగ్స్ ప్రస్తుతానికి హైదరాబాద్ లో ఏర్పాటు చేయకపోవడంతో, ముంబైలో ఉన్న సెట్స్ లోనే షూట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

ADVERTISEMENT
Latest Stories