ఎన్టీఆర్… నో రిలాక్స్ మూడ్…!

Jr NTR busy with RRR movie lookత్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలనీ .. ఆయనతో కలిసి ఒక హిట్ కొట్టాలని ఎన్టీఆర్ ఎంతో కాలంగా ఎదురుచూస్తూ వచ్చాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చేసిన ‘అరవింద సమేత వీర రాఘవ’ ఆ ముచ్చట తీర్చేసింది. దసరా రేసులో ఈ సినిమా విజయవిహారం చేస్తోంది. దాంతో ఈ సినిమా కోసం నాన్ స్టాప్ గా పనిచేసిన ఎన్టీఆర్, నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవచ్చనే టాక్ వచ్చింది.

[m9ad]

ADVERTISEMENT

కానీ ఎన్టీఆర్ రిలాక్స్ కావాలని అనుకోవడం లేదట. తన తదుపరి సినిమా రాజమౌళితో కావడంతో, ఆయన సినిమాలో తన లుక్ కి సంబంధించిన విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడట. శారీరక పరమైన కసరత్తుల విషయంలో 45 రోజుల పాటు కఠోర శిక్షణ తీసుకోనున్నాడని చెబుతున్నారు. వచ్చే నెల 15వ తేదీ నుంచి రాజమౌళి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. తొలి షెడ్యూల్లోనే ఎన్టీఆర్ పాల్గొననున్నాడు. అందువలన అప్పటికి తాను సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ కష్టపడుతున్నాడని చెబుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories