‘సెంటర్ ఆఫ్ అట్రాక్షన్’గా ఎన్టీఆర్!

Jr NTR highlight in RRR Chennai promotions‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషనల్ ఈవెంట్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ‘సెంటర్ అఫ్ అట్రాక్షన్’గా మారిపోతున్నారు. అన్ని భాషలకు సంబంధించిన ఇంటర్వ్యూలలో ప్రాంతీయ భాషలనే మాట్లాడి ఆకట్టుకున్న తారక్ పేరు మరోసారి తమిళనాడులో జరిగిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హైలైట్ అయ్యింది.

ADVERTISEMENT

ఈ వేడుకలో రాజమౌళి మాట్లాడుతూ… తారక్ కు అసలు తానేమి చెప్పనవసరం లేదని, ఇది షాట్ అంటే తారక్ రెడీ అయిపోతాడని, నిజంగా చెప్తున్నాను, జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఓ నటుడు లభించడం టాలీవుడ్, బాలీవుడ్ కాదు, ఇండియన్ సినీ పరిశ్రమ చేసుకున్న అదృష్టంగా కొనియాడారు.

అలాగే మరో హీరో రామ్ చరణ్ కూడా ఎంతో ఎమోషనల్ అయిపోయి తారక్ పై తనకున్న భావాలను పంచుకున్నాడు. తాను చనిపోయే వరకు ఈ సోదరభావం ఇలాగే ఉండాలని ఆశిస్తూ, ఈ జన్మలో తాను ఈ బంధాన్ని మరిచిపోనని జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

తమిళ హీరో శివ కార్తీకేయన్ కూడా ‘తగ్ అఫ్ లైఫ్’ అన్న దానికి జూనియర్ ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అని, అంతటి మాస్ ఫాలోయింగ్ ఉంది కాబట్టే సూట్ అయ్యిందని అభిప్రాయపడ్డారు. చూడబోతుంటే… ఎక్కడ “ఆర్ఆర్ఆర్” ఈవెంట్ జరిగినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మాత్రం జూనియర్ ఎన్టీఆరే అవుతుండడం అభిమానులను మరింతగా ఉత్సాహపరుస్తోంది.

https://twitter.com/Sr1k4r/status/1475500102877777921

https://twitter.com/HumanTsunaMEE/status/1475504477306187781

ADVERTISEMENT
Latest Stories