నా పాత ఇంటర్వ్యూలు చూసుకోండి – ఎన్టీఆర్!

No-Call-from-BalaKrishna-Yet---Jr-NTRవృత్తిపరంగా వరుస సక్సెస్ లతో… వ్యక్తిగతంగా రెండవ తనయుడు జననంతో… ఉరిమే ఉత్సాహంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో ‘సెలక్ట్ మొబైల్స్’ అన్న బ్రాండ్ వచ్చి చేరింది. ఈ మొబైల్ షోరూమ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న జూనియర్ ను మీడియా వర్గాలు పలు ప్రశ్నలు వేయగా, కొన్నింటికి ఓపికగా సమాధానం చెప్పిన తారక్, ఓ ప్రశ్నలో మాత్రం కాస్త అసహనం వ్యక్తం చేసాడు.

ఎన్టీఆర్ బయోపిక్ లో మీరు నటిస్తున్నారా? అంటూ ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, దానికి జవాబు చెప్పడానికి ఇష్టపడని తారక్, ఆ ప్రశ్నను దాటవేసినప్పటికీ, మరలా అదే ప్రశ్న రావడంతో… సదరు మీడియా ప్రతినిధిని తన గత ఇంటర్వ్యూలు చూడాలని, అందులో ఎన్టీఆర్ బయోపిక్ పై తాను ఏం చెప్పానో చూడాలని కోరారు. ఇదే ప్రశ్న గతంలో ఎదురైనపుడు… తనను ఎవరూ అడగలేదని ఎన్టీఆర్ చెప్పిన విషయం తెలిసిందే.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories