జై బాలయ్య అన్న జూనియర్ ఎన్టీఆర్

balakrishna and Jr NTRనందమూరి హరికృష్ణ హఠాన్మరణం తరువాత తమ మధ్య స్పర్థలు పక్కన పెట్టి దగ్గరకు వచ్చారు ఎన్టీఆర్, బాలయ్యలు. హరికృష్ణ చివరి మజిలీలో చంద్రబాబు, బాలయ్య అన్నీ తామే అయ్యి ఏర్పాట్లు చేశారు. దగ్గరుండి కుటుంబసభ్యుల బాధ పంచుకున్నారు. ఆ తరువాత ఎన్టీఆర్ అరవింద సామెత సక్సెస్ మీట్ కు బాలయ్య చీఫ్ గెస్ట్ గా వస్తే మొన్న ఈ మధ్య జరిగిన ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుకకు ఎన్టీఆర్ వచ్చాడు. దీనితో అభిమానులు కూడా ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు వారి ఆనందాన్ని రేటింపు చేస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో హల్ చల్ చేస్తుంది.

[m9ad]

ADVERTISEMENT

జైపూర్ లో రాజమౌళి తనయుడు కార్తికేయ వివాహ సంగీత్ లో తీసిన వీడియో అది. సందర్భం ఏంటో తెలీదు గానీ ఎవరో సెల్ ఫోన్ లో తీసిన ఆ వీడియోలో తారక్ ‘జై బాలయ్య’ అంటూ ఉత్సాహంగా నినాదాలు చేస్తున్నాడు. వీడియోలో తారక్ తో పాటు అఖిల్ అక్కినేని, జగపతి బాబుతో ఇంకా చాలా మంది ఉన్నారు. వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ లలో ఈ వీడియోలో వైరల్ అవుతుంది. నందమూరి అభిమానులు దీనితో ఉత్సాహంతో ఊగిపోతున్నారు.

మరోవైపు రాజమౌళి తనయుడు కార్తికేయ, జగపతిబాబు సోదరుని కుమార్తె పూజా ప్రసాద్‌ నేడు వివాహం చేసుకోనున్నారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో పాటు టాలీవుడ్‌లో చాలామందిని తమ పెళ్లికి ఆహ్వానించారు కార్తికేయ, పూజా. వివాహమంతా మన సౌతిండియా స్టైల్‌లో జరగనున్నప్పటికీ కొంచెం రాజస్థానీ సంప్రదాయ టచ్‌ ఇవ్వనున్నారట. విందులో వడ్డించేవన్నీ అక్కడి వంటకాలే. పెళ్లికి విజిట్‌ చేసిన గెస్ట్స్‌ అందరికీ నెక్ట్స్‌ రెండు రోజులు రాజస్థానీ స్టైల్‌లోనే మర్యాదలు జరగనున్నాయి.

ADVERTISEMENT
Latest Stories