వైరల్ : తారక్ చిలిపి చేష్టలు!

వైరల్ : తారక్ చిలిపి చేష్టలు!‘ఆర్ఆర్ఆర్’ ఈవెంట్ లో రాజమౌళిని గిల్లడం ద్వారా బయటపడిన జూనియర్ ఎన్టీఆర్ నాటి వేషాలు బాగా హైలైట్ అయిన విషయం తెలిసిందే. అలాగే ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ సెట్స్ లో ఈ ఇద్దరి హీరోల అల్లరి వేషాల గురించి రాజమౌళి ప్రత్యేకించి చెప్పగా, ‘నేనా నేనా’ అంటూ తారక్ జక్కన్నను అడిగిన వైనం అభిమానులను అలరించింది.

అయితే జూనియర్ ఎన్టీఆర్ చిలిపి చేష్టలు ఈనాటివి కాదు, గతంలో వివిధ సందర్భాలలో ఇలాగే తన అల్లరిని బయట పెట్టారంటూ ఫ్యాన్స్ ఓ వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. తన తనయుడు అభయ్ రామ్ తో చేసిన అల్లరి మొదలుకుని, అక్కినేని హీరో అఖిల్ కు తొడపాశం పెట్టడం, అలాగే జక్కన్నను గిల్లడం వంటి వాటితో ఈ వీడియో కాస్త వైరల్ అవుతోంది.

ADVERTISEMENT

మొత్తానికి తన సహచరులతో తారక్ మెదులుతున్న వైనం అభిమానులకు, నెటిజన్లకు హాస్యాన్ని పంచుతోంది. ట్రైలర్ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై ఏర్పడిన బజ్ మరియు ఇందులో ఎన్టీఆర్ హైలైట్ అయిన విధానంతో మిక్కిలి ఉత్సాహంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు, ఇలాంటి వీడియోలు మరింత జోష్ ని నింపుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories