నందమూరి తారకరామారావు… అతడే ఒక సైన్యం

Jr NTR - voice over diction in tamil and kannada excellentఆర్‌ఆర్‌ఆర్ మేకర్స్ ఈరోజు రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్‌గా సినిమాలోని అతని క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ఒక నిముషం, 13 సెకండ్లు ఉన్న వీడియో సినిమా మీద ఉన్న హైప్, అంచనాలను అనేక రేట్లు పెంచేసింది. సినిమాలో రామ్ చరణ్ శరీర పరివర్తన ఒక హైలైట్ అయితే తారక్ వాయిస్ ఓవర్ మైండ్ బ్లోయింగ్.

ADVERTISEMENT

అల్లూరి పాత్రను తెలుగు, తమిళం, కన్నడ, మరియు హిందీ… నాలుగు భాషలలో పరిచయం చేస్తూ ఎన్టీఆర్ వాయిస్ఓవర్ ఇచ్చారు. మలయాళ వెర్షన్ కు మాత్రమే డబ్ చేయలేదు. నాలుగు వెర్షన్లు వాయిస్ఓవర్ అద్భుతంగా కుదిరింది. తారక్ తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా డిక్షన్ మరియు వాయిస్ మాడ్యులేషన్‌లో తనకు తానే సాటి అని నిరూపించాడు.

ఒక భాష, రెండు భాషలు అనుకుంటే వేరు… నాలుగు భాషలలో సమానంగా అంతే అద్భుతంగా చెప్పి మెప్పించడం అంటే సామాన్యమైన విషయం కాదు. తెలుగు ఇండస్ట్రీలోనే కాక తారక్ దేశంలోనే ఉత్తమ డైలాగు డెలివరీ కలిగిన నటుడు అంటే అతిశయోక్తి కాదేమో అంటున్నారు చాలా మంది.

ఇక మే 20 న ఎన్టీఆర్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోను తారక్ బర్త్ డే, మే 20న విడుదల చేసే అవకాశం ఉంది. ఈ వీడియోకు వచ్చిన అద్భుత స్పందన తో మే 20 న అంచనాలను అందుకోవడం అంత సులభం కాదు. కానీ రాజమౌళి దర్శకుడు కాబట్టి మనం ఎప్పుడూ హైప్ మరియు అంచనాలను పెంచుకోవచ్చు. ఆర్‌ఆర్‌ఆర్‌ను 2021 జనవరి 8 న సంక్రాంతి స్పెషల్‌గా సిద్ధం చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories