కాజల్…కొత్త అవతారమా??

Kajal Aggarwal in negative roleహీరోయిన్ గా టాప్ రేంజ్ ని అందుకున్న అందాల భామల్లో కాజల్ అగర్వాల్ ఒకరు…ఆమె అందాల ఆరబోత పుణ్యమా అని దాదాపుగా 10 ఏళ్లకు పైగానే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో నిలిచింది. అయితే హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తూనే కాజల్ ఐటెం సాంగ్స్ కి కూడా రెడీ అయిపోయింది..

[m9ad]

ADVERTISEMENT

జనతా గ్యారేజ్ సినిమాలో ‘పక్కా లోకల్’ పాపగా అలరించిన కాజల్ పాపం గత ఏడాది వరుసగా సినిమాలు అయితే చేసింది కానీ…ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ అనిపించుకోలేదు..ఇక యూనివర్సల్ యాక్టర్ కమల్ తో భారతీయుడు-2 చేస్తున్న కాజల్ ఈ సినిమాలో విలక్షణ పాత్ర చేస్తున్నట్లు సమాచారం..

ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం కాజల్ తేజ సినిమా విలన్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం..అయితే ఈ సినిమాలో కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది అని..పేరుకు మాత్రమే ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరో అని కానీ సినిమా మొత్తం ఆమె పాత్ర ఆధారంగానే ఉంటుంది అని సమాచారం.

ఇక మన టాలీవుడ్ లో హీరోయిన్స్ విలన్స్ గా మారడం చాలా అరుదు..మరి కాజల్ లాంటి అందాల భామ ఈ నిర్ణయం తీసుకుంది అంటే….ఇది ఖచ్చితంగా మరో ట్రెండ్ కి శ్రీకారమే అని చెప్పవచ్చు. చూద్దాం మరి ఏం జరగబోతుందో.

ADVERTISEMENT
Latest Stories