కాజల్ సిస్టర్ ముద్దు పెట్టింది!

Kajal Aggarwal kisses Mehrene Kaur Pirzadaచోట కే నాయుడు పుణ్యమా అంటూ…. బెల్లంకొండ శ్రీనివాస్ “కవచం” సినిమా టీజర్ ఈవెంట్ వేడుక హాట్ టాపిక్ అయ్యింది. దీంతో సదరు సినిమాకు పబ్లిసిటీ పరంగా డోకా లేకుండా పోయింది. ఈ వేడుక ముద్దులకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిందంటూ నెటిజన్లు ఈ ఈవెంట్ లోని ముద్దుల వీడియోలను సర్క్యూలేట్ చేస్తూ సందడి చేస్తున్నారు.

ADVERTISEMENT

[m9ad]

ఇప్పటికే కాజల్ ను చోటా ముద్దుపెట్టినది రచ్చరచ్చగా వైరల్ కాగా, ఇదే ఈవెంట్ లో మెహ్రీన్ మాట్లాడుతున్న సమయంలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ వచ్చి ముద్దుపెట్టిన వీడియో కూడా హంగామా చేస్తోంది. ఇలా ముద్దు పెడుతున్న ఫోటోనే హీరోయిన్ మెహ్రీన్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి, వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.

చూసినవాళ్ళు తామిద్దరినీ (కాజల్ – మెహ్రీన్) సిస్టర్స్ అనుకుంటారని, దీంతో తన ఆత్మీయ సహోదరి నుండి ప్రేమను అందుకున్నానని, తాను కూడా అంతటి ప్రేమను అందిస్తానని చెప్తూ… తనను కాజల్ అగర్వాల్ ముద్దుపెడుతున్న ఫోటోను మెహ్రీన్ పోస్ట్ చేసింది. ఈ ముద్దుల సంగతి ఎలా ఉన్నా… బెల్లంకొండ “కవచం”కు మాత్రం ప్రేక్షకులలో రిజిస్టర్ అయ్యింది.

ADVERTISEMENT
Latest Stories