మీటూ ఎఫెక్ట్? ఐక్యత మిస్ అయ్యిందా?

Kajal Aggarwal- Mee Tooఒక పక్క హిందీలో తనుశ్రీ దత్తా నుంచి ఇక్కడ తమిళంలో చిన్మయీ వరకూ ఎవరికి వారు మీటూ పేరుతో కళాకారులపై జరుగుతున్న లైంగిక వేధింపులపై తమ గొంతును బలంగా వినిపిస్తున్నారు. మరో పక్క అప్పట్లోనే తనను లైంగికంగా వేధించారు…వాడుకున్నారు అంటూ బడా బాలీవుడ్ తారలు అయినటువంటి కంగనా రణౌత్, కత్రీనా కైఫ్ లాంటి తారలే ఎంతో మంది హీరోలపై, ఎందరో దర్శక, నిర్మాతలపై ఆరోపణలు చేశారు. అయితే ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం మాత్రం కాస్త తేడాగా ఉంది.

[m9ad]

ADVERTISEMENT

అదేంటి అంటే ఒక పక్క కొందరు తారలు, సినిమా పరిశ్రమకు చెందిన వారు మీటూ పేరుతో పోరాటం చేస్తూ ఉంటే, మరో పక్క కొందరు అందాల భామలు మాత్రం “చల్..అటువంటిది ఏమీ లేదు…గదంతా ట్రాష్ రా భయ్” అంటూ కొట్టి పారేస్తున్నారు. మొన్నటికి మొన్న కాజల్ అగర్వాల్..చస్ అసలు నన్ను ఎవ్వరూ అడగలేదు ఆ ఫేవర్ కోసం అడగలేదు అని అలాంటి ఆరోపణలు అన్నీ ట్రాష్ అంటూ కొట్టి పారెయ్యగా…ఆ మధ్య సాయి పల్లవి సైతం లేదు అసలు నన్ను ఎవ్వరూ ఇప్పటివరకూ ఆ ఫేవర్ అడగలేదు అని అన్నారు. ఇక ఒకానొక ఇంటర్‌వ్యూలో క్యూట్ బ్యూటీ మెహ్రీన్ కూడా అసలు క్యాస్టింగ్ కౌచ్ గురించి తనకు పెద్దగా ఏమీ తెలీదు అని తేల్చిపడేసింది. ఇక ఆ బ్యాచ్ లోకే చేరింది మరో భామా తమన్నా.

కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు తీసే వాళ్ళు హీరోయిన్లను సెక్సువల్ ఫేవర్స్ ఎలా అడుగుతారు అంటూ అసలు అవన్నీ అబద్దాలే అంటూ తీసి పారేసింది. అయితే మీటూకు సపోర్ట్ చేస్తే కరియర్ పరంగా ఇబ్బందులు పడవలసి వస్తుందేమో అని ఇలా అంటున్నారో, లేక ఇప్పటికే ఫైట్ చేస్తున్న వాళ్ళు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అలా మాట్లాడుతున్నారో తెలీదు కానీ..మొత్తంగా చూసుకుంటే మాత్రం మీటూ పోరాటంలో తారల్లో ఐక్యత కొరవడింది..అందుకే దాని ఎఫెక్ట్ కనిపించకుండా పోయింది అని స్పష్టంగా చెప్పవచ్చు. .

ADVERTISEMENT
Latest Stories