కళ్యాణ్ రామ్ తప్పుకుంటాడా?

Kalyan Ram Entha Manchivaadavuraa skips sankranthi raceసంక్రాంతి బరిలోకి పుంజులు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలో బరిలో కాలు దువ్వుతుండగా, తాజాగా వెంకటేష్ – నాగచైతన్యల వెంకీ మామ సినిమా కూడా ఎంటర్ అయ్యింది. అలాగే రజినీకాంత్ దర్బార్ కూడా ఉంది. దీనితో నందమూరి కళ్యాణ్ రామ్ కు ఇబ్బంది వచ్చిందంటున్నారు.

కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా సంక్రాంతికి విడుదల చెయ్యబోతున్నాం అని ఆ నిర్మాతలు ఎప్పుడో ప్రకటించారు. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా సంక్రాంతి విడుదలపై ఆ చిత్రబృందం ఆలోచనలో పడిందట. నాలుగు ప్రముఖమైన సినిమాల వెనుక బలమైన డిస్ట్రిబ్యూటర్లు ఉండటంతో తమకు థియేటర్లు దొరకడం కష్టం ఏమో అని వారి అనుమానం.

ADVERTISEMENT

దీనితో సినిమా వాయిదా వేసుకోవాలా అనే ఆలోచనలో ఉన్నారు. అయితే ప్రస్తుతానికి వేచిచూసే ధోరణిలో ఉన్నట్టు సమాచారం. ఒకవేళ సంక్రాంతికి కుదరకపోతే గణతంత్ర దినోత్సవం సందర్భంగా రావొచ్చని తెలుస్తుంది. ఉమేష్‌ గుప్తా, సుభాష్‌ గుప్త నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో కల్యాణ్‌ రామ్‌కు జంటగా మెహరీన్‌ నటిస్తున్నారు.

సతీష్ వేగేశ్న డైరెక్టర్. గతంలో ఆయన సంక్రాంతికి శతనామానం భవతి వంటి పెద్ద హిట్ ఇచ్చాడు. ఆ సినిమాతో జాతీయ అవార్డు కూడా దక్కించుకున్నాడు. వరుస ప్లాపుల తరువాత కళ్యాణ్ రామ్ తన గత చిత్రం 118తో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. ఈ సినిమాకు హిట్ చేసుకుని విజయాల పరంపరను కొనసాగించాలని కృతనిశ్చయంతో ఉన్నారు.

ADVERTISEMENT
Latest Stories