యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ తాజాగా ‘చీకటి రాజ్యం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. సినిమా సక్సెస్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకు పోతున్న కమల్ అదే క్రమంలో మరో సినిమాకు ఓకే చెప్పిన విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ సినిమాను కమల్ హాసన్ అధికారికంగా ప్రకటించాడు. రాజీవ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఆ సినిమాలో అక్కినేని అమల ముఖ్య పాత్రలో నటించబోతుంది. అమెరికాలో త్వరలో ప్రారంభం అవ్వబోతున్న ఈ సినిమాకు తాజాగా టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
తెలుగు మరియు తమిళంలో ఏకకాలంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు తెలుగు టైటిల్‌గా ‘అమ్మా నాన్న ఆట’గా నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. వైవిధ్యభరితంగా ఉన్న టైటిల్ సినిమాపై అంచనాలను ఆసక్తిని పెంచుతోంది. చాలా కాలం తర్వాత కమల్ హాసన్ మరియు అమలల కాంభినేషన్‌లో సినిమా వస్తుండటంతో పాటు వైవిధ్యభరిత కథాంశం మరియు వైవిధ్యభరిత టైటిల్‌తో ఇప్పటి నుండే సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అతి త్వరలో షూటింగ్ ప్రారంభం అయ్యి, కేవలం 50 రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేసి వచ్చే వేసవికి ముందే ఈ సినిమాను తెలుగు మరియు తమిళంలో విడుదల చేయాలని కమల్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.





