జగన్ 1 రూపాయి జీతంతో 200-300 కోట్లు!

Raghu-Rama-Raju i మా ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన వాలెంటైర్ వ్యవస్థ అత్యంత దారుణమైన విషయమని, వచ్చే ఎన్నికలలో ఏ పార్టీ అయితే దీనిని రద్దు చేస్తామని బహిరంగంగా ముందుకు వస్తుందో, ఆ పార్టీని జనం ఖచ్చితంగా గెలిపిస్తారని రఘురామకృష్ణంరాజు చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT

5 వేల రూపాయల జీతానికి ఎవరు పనిచేస్తారు? దీనిని అడ్డం పెట్టుకుని మరింత సంపాదిస్తున్నారని, మా ముఖ్యమంత్రి అయితే నెలకు 1 రూపాయి జీతం తీసుకుని పని చేస్తారని, అంత మహానుభావులు, ఉదార స్వభావం ఈ వాలెంటైర్లకు ఉండదని అభిప్రాయపడ్డారు.

మా ముఖ్యమంత్రి నెలకు తీసుకునే 1 రూపాయి జీతంతో సాక్షికి ప్రభుత్వం యాడ్స్ ఇచ్చే అవకాశం లభించిందని, దీని ద్వారా మరో రెండు, మూడొందల కోట్లు సంపాదించుకుంటున్నారని ఆరోపించారు. ప్రతి నెలా ఏ బిల్లు చెల్లించినా లేకున్నా, ఈ సాక్షి బిల్లులు మాత్రం ఖచ్చితంగా చెల్లింపులు అవుతాయని అన్నారు.

రంగులు పిచ్చి అనేది ఉన్మాదంలా మారిపోయిందని, మంత్రి పాల్గొనే కార్యక్రమంలో పిల్లలకు రంగులు వేయడం ఏంటండీ? ఇది ఉన్మాదం కాదా? ఖచ్చితంగా ఉన్మాదమే..! రేపొద్దున క్యాబినెట్ మీటింగ్ కు రంగులేసుకుని రమ్మంటే, వీళ్ళు కూడా రంగులు వేసుకుని వెళ్తారేమో అన్న భావనను ఆర్ఆర్ఆర్ వ్యక్తపరిచారు.

బూతులు తిట్టమంటే తిడుతోన్న వైసీపీ నేతలకు “బూతు రత్న, బూతు శ్రీ” ఇలాంటి అవార్డులు కూడా త్వరలో ప్రవేశపెట్టొచ్చు, ప్రస్తుతానికి ఇది జోక్ లాగా అనిపించవచ్చు గానీ, ఖచ్చితంగా ఏ అర్ధరాత్రో, తెల్లవారుజామునో ఆయనకు అనిపిస్తుందని, ఈ అవార్డులు ఖచ్చితంగా ప్రవేశపెడతారని రాజు గారు చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT
Latest Stories