షాకింగ్ – సైకిల్ ఎక్కిన పవన్ కళ్యాణ్!

katamarayudu first look fan made edit‘జనసేన’ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏమిటి… తెలుగుదేశం పార్టీ సింబల్ అయిన సైకిల్ ఎక్కడమేంటి..? అనుకుంటున్నారా? అవును నిజమే… అయితే ఇది పవన్ స్వయంగా ఎక్కిన సైకిల్ కాదు, ఎవరో ఒక అభిమాని బలవంతంగా ఎక్కించిన సైకిల్ మాదిరి అగుపిస్తోంది. ఏది ఏమైనా… ఈ ఫోటో సోషల్ మీడియాలో ‘కాటమరాయుడు’ ఫస్ట్ లుక్ పేరుతో సందడి చేస్తోంది.

ADVERTISEMENT

అసలు విషయం ఏమిటంటే… పవర్ స్టార్ నటిస్తున్న తాజా చిత్రం “కాటమరాయుడు” ఫస్ట్ లుక్ విడుదలను చిత్ర యూనిట్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. శనివారం నాడు సాయంత్రం 7 గంటలకు దీపావళి సందర్భంగా ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నామని తెలిపింది. దీంతో సహజంగా ఉత్సాహంగా ఉండే పవర్ స్టార్ ఫ్యాన్స్ తమ అభిరుచులకు అనుగుణంగా ఓ పోస్టర్ ను సిద్ధం చేసి సోషల్ మీడియాలో వదిలారు. అది కాస్త అభిమాన సందోహంలో సర్క్యూలేట్ అవుతోంది.

ఆ కనపడుతున్న పోస్టర్ లో వేరొకరి స్థానంలో పవన్ కళ్యాణ్ తలకాయను అతికించినట్లుగా కనపడుతోంది. అయితే ఓవరాల్ గా చూడడానికి బాగుండడంతో అభిమానులు షేర్ చేసుకుంటూ హంగామా చేస్తున్నారు. ఓ అభిమాని చేసిన పోస్టర్ కే ఈ రేంజ్ లో ఉంటే, మరి అసలు లుక్ వస్తే ఆ సందడి ఎలా ఉంటుంది? సోషల్ మీడియా అంతా “కాటమరాయుడు” మోత మోగాల్సిందేనా..!?

ADVERTISEMENT
Latest Stories