గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో కౌషల్ పేరు!

Bigg-Boss-2-Telugu-Winner---Kaushalతన యాటిట్యూడ్ తో అశేష అభిమానగణాన్ని సొంతం చేసుకున్న ‘బిగ్ బాస్ 2’ విన్నర్ పేరు త్వరలో ‘గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు సంపాదించుకోబోతోంది. అవును… మీరు చదివింది కరెక్టే… స్వయంగా ఈ విషయాన్ని కౌషలే స్పష్టం చేసారు. ‘గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ వారి నుండి కౌషల్ కు ఇప్పటికే ఫోన్ కాల్ వచ్చిందట.

[m9ad]

ADVERTISEMENT

ఒక సింగిల్ కంటేస్టెంట్ కు ఈ స్థాయిలో ఓట్లు రావడం అనేది టీవీ చరిత్రలో ఎప్పుడూ జరగలేదట. దీంతో తన పేరు ‘గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో నమోదు కావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన కౌషల్, దీనిని సమయం చూసుకుని అధికారికంగా ప్రకటిస్తామని గిన్నిస్ బుక్ వారు చెప్పినట్లుగా తెలుస్తోంది.

బోయపాటి – చరణ్ సినిమాలో ఆఫర్ వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ… ఈ విషయాన్ని తెలిపాడు కౌషల్. రామ్ చరణ్ మూవీలో అవకాశం వచ్చిన మాట నిజమేనని, అయితే అది ఓకే కాగానే తానే అధికారికంగా తెలియజేస్తానని స్పష్టం చేయడంతో, ప్రస్తుతం ఫుల్ ఖుషీలో ఉంది ‘కౌషల్ ఆర్మీ.’

ADVERTISEMENT
Latest Stories