త్వరలో రెండు సినిమాల్లో నటించనున్న బిగ్ బాస్ కౌశల్

Kaushal to act in two moviesఇటీవలే బిగ్ బాస్-2 విజేతగా నిలిచిన కౌశల్ తనకు కొత్తగా వచ్చిన స్టార్ డమ్ ను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నాడు. స్టార్ డమ్ తో పాటు అతనికి సినిమా ఛాన్సులు కూడా వస్తున్నట్టు తెలిపారు. తొందర్లో రెండు సినిమాలు సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు 82 చిత్రాల్లో వివిధ పాత్రలలో కనిపించారు కౌశల్.

[m9ad]

ADVERTISEMENT

“హీరోతో పాటు ప్రతినాయకుడు పాత్రలను నేను సూట్‌ అవుతాననే నమ్మకం ఉంది. హీరోగా నటించడంతో పాటు ప్రతినాయకుడి పాత్రల్లో… అంటే ‘ధృవ’ చిత్రంలోని అరవింద్‌స్వామి నటించిన పాత్రల్లో తాను నటిస్తే బాగుంటుందని భావిస్తున్నా,” అని కౌశల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

“బిగ్‌బాస్‌-2 నుంచి విజేతగా బయటకు వచ్చాక తొలిసారిగా ఫోన్‌ చేసిన దర్శకుడు మారుతి. అలాగే సుకుమార్‌ కూడా ఫోన్‌ చేసి అభినందించారు. అంతేకాక ప్రధానమంత్రి కార్యాలయం నుంచి శుభాకాంక్షలు అందాయి. త్వరలో డాక్టరేట్‌ ప్రదానం చేస్తామని ఒక యూనివర్సిటీ నుంచి ఫోన్‌ వచ్చింది,” అని కూడా ఆయన చెప్పారు.

ADVERTISEMENT
Latest Stories