తెలంగాణ తల్లి కల్వకుంట్ల కవితని కాపాడుతుందా?

Kavitha

బిఆర్ఎస్ పార్టీ రాజకీయాలకు తెలంగాణ ఉద్యమాలు, తెలంగాణ సెంటిమెంట్ రెండు బలమైన పునాదులని అందరికీ తెలుసు.

రేవంత్ రెడ్డి ఆ పునాదులను దెబ్బ తీయాలని ప్రయత్నాలు (కుట్రలు) చేస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ గట్టిగా నమ్ముతోంది. వాటిలో భాగంగానే తెలంగాణ తల్లి విగ్రహం రూపు రేఖలు మార్చారని వాదిస్తున్నారు.

ADVERTISEMENT

కేసీఆర్‌ పదేళ్ళ పాలనలో బతుకమ్మ అంటే కల్వకుంట్ల కవిత.. ఆమె అంటే బతుకమ్మ అన్నట్లు చాలా ప్రమోట్ చేసుకున్నారు.

ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహంలో ఆ బతుకమ్మ లేకపోవడాన్ని ఆమె తెలివిగా వినియోగించుకుంటున్నారు.

తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో ఉండే బతుకమ్మని తొలగించడం ద్వారా తెలంగాణ సంస్కృతిని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తుడిచిపెట్టేయాలని ప్రయత్నిస్తోందని కల్వకుంట్ల కవిత ఆరోపించారు.

తెలంగాణ చరిత్రలో కేసీఆర్‌ని, బతుకమ్మని ఎవరూ చెరిపేయలేరని ఆమె అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి తమకు ఆమోదయోగ్యం కాదని, ఆమె కాంగ్రెస్‌ తల్లే తప్ప తెలంగాణ తల్లి కాదన్నారు.

తెలంగాణ సెంటిమెంట్ బిఆర్ఎస్ పార్టీకి ఏవిదంగా బలమైన ఆయుధంగా నిలుస్తోందో, ఆదేవిదంగా బతుకమ్మ కూడా కల్వకుంట్ల కవితకి ప్రత్యేక గుర్తింపునిస్తోంది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో జైలుకి వెళ్ళడంతో ఆమె ప్రతిష్ట మసకబారింది. అందువల్లే ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత రెండు నెలలు ప్రజలకు మొహం చూపలేక బతుకమ్మ పండుగకు కూడా దూరంగా ఉండిపోయారు. కానీ ఇప్పుడు అదే బతుకమ్మతో ఆమె రాజకీయాలలో యాక్టివ్‌ అవుతున్నారు.

బతుకమ్మని కాపాడుకునేందుకు అంటూ నేడు ఆమె జగిత్యాలలో బతుకమ్మతో కూడిన (పాత) తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకి స్వయంగా భూమిపూజ చేశారు. సుమారు 22 అడుగుల ఎత్తుతో తెలంగాణ తల్లి కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని కల్వకుంట్ల కవిత చెప్పారు.

అయితే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ తల్లి (కొత్త) విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఇలా పాత విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు పూనుకుంటే అంగీకరిస్తుందా?అంటే కాదనే చెప్పొచ్చు.

కనుక తెలంగాణ ప్రభుత్వం పోలీసులతో ఈ విగ్రహం ఏర్పాటుని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ‘రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ తల్లిని వ్యతిరేకిస్తోందంటూ’ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో బిఆర్ఎస్ పార్టీ, తెలంగాణ జాగృతి ఆందోళనలు నిరసనలు చేపట్టడం తధ్యం. కనుక రాజకీయాలలో చురుకుగా పాల్గొనడానికి కల్వకుంట్ల కవిత చాలా చక్కటి అంశం, వ్యూహం ఎంచుకున్నారని భావించవచ్చు.

ADVERTISEMENT
Latest Stories