
ప్రత్యేక తెలంగాణ లక్ష్యంతో 2001ఏప్రిల్ 7 న కేసీఆర్ స్థాపించిన ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ పార్టీతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి.
అయితే తెరాస ఏర్పడిన ఆరంభంలో ఆ పార్టీ రాష్ట్ర రాజకీయాలలో పెద్దగా ప్రభావం చూపకపోయినా క్రమక్రంగా నిలదొక్కుకుంటూ 2009 నవంబర్ 29 న ప్రత్యేక తెలంగాణ నినాదంతో కేసీఆర్ చేసిన 9 రోజుల నిరాహారదీక్షతో తనదైన గుర్తింపు తెచ్చుకుంది.
ఇక అక్కడి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనే లక్ష్యంగా కేసీఆర్ ఆడిన రాజకీయ చదరంగంలో ప్రత్యేక తెలంగాణ సాధనతో 2014 లో తెరాస అనుకున్న లక్ష్యాన్ని అందుకుని దశాబ్దం పాటు తెలంగాణ అధికార పీఠాన్ని దక్కించుకుంది.
ఇలా గత 25 సంవత్సరాలుగా కేసీఆర్ తెరాస బిఆర్ఎస్ గా మారి తెలుగు రాష్ట్ర రాజకీయాలలో ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తూవస్తోంది. అయితే ఇదే తెరాస లో తమ రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టిన కేసీఆర్ కుమారుడు కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, సిరిసిల్ల ఎమ్మెల్యేగా, ఐటీ మంత్రిగా రాజకీయ అనుభవాన్ని వెనకేసుకున్నారు.
ఇక కుమార్తె గా కవిత కూడా పార్టీ ఎంపీగా, ఎమ్మెల్సీ గా తనదైన పాత్ర పోషించారు. అయితే తాజాగా జరిగిన కొన్ని పరిణామాలతో బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ వేటుతో బయటకొచ్చిన కవిత ఇప్పుడు జాగృతితో తన సొంత రాజకీయానికి శంకుస్థాపన చేసుకున్నారు.
ఇలా సరిగ్గా పాతికేళ్ల తరువాత తెలంగాణలో అదే కేసీఆర్ కుటుంబం నుంచి ఆయన కుమార్తె కవిత కేసీఆర్ స్థాపించిన బిఆర్ఎస్ కు పోటీగా తెలంగాణ ప్రజా జాగృతి పార్టీతో తెలంగాణలో సొంత రాజకీయం మొదలు పెట్టనున్నారు. మరి కవిత కూడా తండ్రి పార్టీ మాదిరే బుడిబుడి అడుగులు వేసుకుంటూ ఆ ఒక్క అవకాశం కోసం కాచుకుని కూర్చుంటారా.?
లేదా తొలి అడుగుతూనే తండ్రి కేసీఆర్ కి అన్న కేటీఆర్ కి రాజకీయ గుదిబండలా మారతారా.? 2001 కేసీఆర్ తెరాస ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనే లక్ష్యంగా అడుగులేస్తే 2026 కవిత టీపీజే బిఆర్ఎస్ ఓటమి, కవిత ముఖ్యమంత్రి పీఠమే ధ్యేయంగా అడుగులు వేయబోతుందా.?
తెరాస తో కేసీఆర్ ఆంధ్రా ను రెండు ముక్కలు చేస్తే టీపీజే తో కవిత కల్వకుంట్ల కుటుంబ రాజకీయాన్ని రెండు ముక్కలు చేస్తున్నారా.? అక్కడ కేసీఆర్ లక్ష్యాన్ని అందుకోవడానికి 14 ఏళ్ళ సమయం తీసుకుంటే మరి ఇక్కడ కవిత తన లక్ష్యాన్ని అందుకోవడానికి ఎన్నేళ్ళ సమయం తీసుకోనున్నారు.?
A film can have a weak trailer, little audience interest and still look like a…
After the 2024 Assembly election victory, TDP, Jana Sena and BJP are preparing for their…