కల్వకుంట్ల బయోపిక్ ఇలా ఉందేమిటి కవితమ్మా?

Kavitha vs KTR BRS dispute

టీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాత్రం అన్నని, తండ్రిని ముఖ్యంగా బావని విడిచిపెట్టడం లేదు. తరచూ ముగ్గురినీ ఏదో పేరుతో విమర్శిస్తూనే ఉన్నారు. కానీ ఆమెను, ఆమె విమర్శలను ఎవరూ పట్టించుకోవడం లేదు. కనుక ఆమెది అరణ్య రోదనగానే మిగిలిపోతోంది.

అయితే ఇటీవల చెల్లి కవిత ప్రస్తావన వచ్చినప్పుడు కేటీఆర్‌ ఏమన్నారంటే, “నియోజకవర్గంలో ఎమ్మెల్యే సిఎం వంటివారని కనుక ఒకరి నియోజకవర్గంలో మరొకరు వేలు పెట్టవద్దని కేసీఆర్‌ స్పష్టంగా ఆదేశించినందున చాలా సమస్యలు నా దృష్టికి రాలేదు,” అని అన్నారు.

ADVERTISEMENT

అయితే కల్వకుంట్ల కవిత రియాక్షన్ చాలా ఘాటుగా ఉంది. “నేను మీ పార్టీలో ఒక్క అవినీతి గుంటనక్కను విమర్శిస్తేనే.. కొన్ని గంటల్లో పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేశారు అదే గుంటనక్కతో అంటకాగుతూ మీ పార్టీ అధినేత తీరుతోనే నష్టపోయామని మీరు బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం పార్టీ వ్యతిరేకం కాదా?

మీరు మీ పార్టీ అధినేత KCR గారిని విమర్శించడం.. ఆయన తీసుకున్న విధాన పరమైన నిర్ణయాలను బాహాటంగా తప్పు పట్టడం పార్టీ వ్యతిరేక చర్య కాదా!?

మీ ఫామ్ హౌస్ లు, అక్రమంగా ఇచ్చిన పర్మిషన్లు.. ఆంధ్రా దోస్తులకు ఇచ్చిన నజరానాలు.. క్విడ్ ప్రో కో దందాలతో మీ పార్టీని పాతాళంలోకి నెట్టింది మీరు కాదా?

నిన్నటి బీఆర్ఎస్ మీటింగులో ఓ రైతు ఫోన్ మాట్లాడుతుంటే “నీ పెండ్లామా!? అంత అర్జెంటా!? అని అహంకారంతో అతని భార్యనే అవమానించారు..” “ఒక మహిళా సాయం కోరి వస్తే నా కోసం కన్నావా” అని అమ్మనే అవమానించారు గుంటనక్క MIND GAME లో BLIND గా పడిపోయి పెద్ద మనిషినే తప్పు బడుతున్నావ్.. బీఆర్ఎస్ కు గోతిని తవ్వుతున్నావ్ కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్టు..

పార్టీలో మీ వైఫల్యాన్ని.. మీ చేతగాని తనాన్ని బీఆర్ఎస్ అధినేతపై మోపుతున్నావు అంటే… ప్రత్యక్ష రాజకీయాల్లో మీ స్థానం ఏమిటో అర్థమవుతుందా? నిమజ్జనోత్సవంలో ఎంతమంది సోషల్ మీడియా influencers ను బతిమాలుకున్నారో ఆ గణేష్ మహారాజుకు, మీ అంతరాత్మకు తెలుసు… నేను నీలాగా విష నాగుల మాటలు విని మాట్లాడను.. నిర్ధిష్టమైన ఆధారాలతోనే మాట్లాడుతాను.. నాతో పెట్టుకోకు,” అని కవిత అన్నారు.

ఆమె ఫామ్‌హౌసులు, క్విడ్ ప్రోలు, గణేష్ నిమజ్జనాలంటూ చేసిన ఈ వ్యాఖ్యలు వింటుంటే, అవి బీఆర్ఎస్‌ పార్టీ బయోపిక్‌లా… ఇంకా చెప్పాలంటే కల్వకుంట్ల కుటుంబ బయోపిక్‌లా అనిపిస్తోంది.

ADVERTISEMENT
Latest Stories