అవసరమా..?

Kavya Maran Abrar Ahmed SRH controversy

తాజాగా జరిగిన ది హండ్రెడ్ లీగ్ ఆక్షన్ లో సన్-రైజర్స్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం నేడు సోషల్ మీడియాలో ఒక విధ్వంసానికి కారణమయింది. ఈ ఏడాది జరగనున్న ది హండ్రెడ్ లీగ్ లో ప్రస్తుతం ఐపీఎల్ జట్లకు యజమానులుగా వ్యవహరిస్తున్న 4 జట్లు-హండ్రెడ్ లీగ్ లో టీం ల ను కొనుక్కున్నారు.

ది హండ్రెడ్ లీగ్ చరిత్రలో మొట్ట మొదటి నిన్న ఆక్షన్ నిర్వహించగా,ముంబై, లక్నో, ఢిల్లీ మరియు సన్-రైజర్స్ జట్లు ఈ ఆక్షన్ లో పాల్గొన్నాయి. అయితే, మొత్తం ఆక్షన్ కే పాయింట్ అఫ్ అట్రాక్షన్ అయింది అబ్రార్ అహ్మద్ యొక్క డీల్. సన్-రైజర్స్ లీడ్స్ జట్టు పాక్ ఆటగాడు అబ్రార్ ను కొనుగోలుచేయటం ఏ భారత అభిమాని కు నచ్చలేదు.

ADVERTISEMENT

సన్-రైజర్స్ జట్టు అబ్రార్ ను మన కరెన్సీ లో సుమారు 2.4 కోట్లు పెట్టి కొనుగోలు చేయగా, పాక్ కరెన్సీ లో ఇది ఏకంగా 7 కోట్లు. ఇంత భారీ ధర తో ఒక పాక్ ప్లేయర్ ను కొనుగోలు చేసుకోటం భారత అభిమానులను నిస్పృహ కు గురి చేస్తుంది.

పహెల్గాం సన్నివేశం, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండో-పాక్ సంబంధాలు అసలు ఏ మాత్రం బాగోలేదు. అందులోనూ, ఆపరేషన్ సింధూర్ సమయంలో మన ఆర్మీ దళాన్ని వెక్కిరిస్తూ అబ్రార్ చేసిన పోస్ట్ అప్పట్లో సెన్సేషన్ గా మారి, భారత అభిమానుల చేత ఎన్నో ట్రోల్స్ కు గురయ్యాడు అబ్రార్.

ఛాంపియన్స్ ట్రోఫీ ’25 లో శుబ్మాన్ వికెట్ పొందగానే అతడు చూపిన హావభావాలు భారత్ ఫ్యాన్స్ కు అతనిపై ఎనలేని కోపాన్ని పెంచింది. ఇందుకు తోడు, ఐపీఎల్ జట్లు హండ్రెడ్ లో పాల్గొననున్నాయి అని తెలియగానే, పాక్ ప్లేయర్స్ పై అనధికార బ్యాన్ పడేందుకు అవకాశాలు లేకపోలేవని పలువురు రిపోర్ట్స్ జారీ చేశారు.

దీనితో అభిమానులు సైతం ఈ హండ్రెడ్ లీగ్ లో పాక్ ప్లేయర్ల పార్టీసిపేషన్ ఉండదని ఫిక్స్ అయిపోయారు. కానీ, చివర్లో సన్-రైజర్స్ జట్టు అబ్రార్ ను కొనుగోలు చేసి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు. ఎస్.ఆర్.హెచ్ చేసిన చర్యకై అభిమానుల ఆగ్రహం మాములుగా లేదు.

గడిచిన 24 గంటల్లో కొన్ని లక్షల ట్వీట్లు మరియు పోస్ట్లు ఎస్.ఆర్.హెచ్ కు వ్యతిరేకంగా వెలువడ్డాయి. ఇవాళ ఏకంగా సన్-రైజర్స్ లీడ్స్ యొక్క అఫీషియల్ అకౌంట్ ను సస్పెండ్ చేసింది ఎక్స్. ఫాన్స్ ఆగ్రహం ఆపుకోలేక నేరుగా ఎక్స్ లో ఎస్.ఆర్.హెచ్ లీడ్స్ ను రిపోర్ట్ చేశారని తెలుస్తుంది.

విషయమంతా అయిపోయాక, ఆ జట్టు కోచ్ డేనియల్ విటోరీ ప్రెస్ ముందుకు వచ్చి ‘మేము జట్టు అవసరాల బట్టి ఈ నిర్ణయానికి వచ్చాము’ అని చెప్పినప్పటికీ, వేరే ఏ స్పిన్నర్ లేనట్టు ఒక పాక్ ఆటగాడ్ని ఎంపిక చేసుకోవాల్సిన అవసరమేంటని అభిమానులు ఇంకా ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. చూడాలి మరి ఇది ఇక్కడితో ఆగుతుందా.. లేదా ఎస్.ఆర్.హెచ్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆ జట్టు బ్రాండ్ వాల్యూ పడిపోయే అవకాశాలేమైనా ఉన్నాయా అని..!

ADVERTISEMENT
Latest Stories