అవకాశాలు లేకపోతే మరీ ఇలాంటి సినిమాలు చేయాలా?

Kayyum Bhai Theatrical Trailerఒకే సారి తొమ్మిది సినిమాలను ప్రారంభించి ‘టాక్ ఆఫ్ టాలీవుడ్’గా మారిన నందమూరి తారకరత్న, అప్పటినుండి ఇప్పటివరకు ఒక్క హిట్ ను కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. హీరోగా సక్సెస్ కాలేదన్న విషయం గమనించుకుని, ప్రతినాయకుడిగా కూడా ‘అమరావతి’ ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయినా పెద్దగా ఫలితం లేకపోయింది, అలాగే పరిస్థితులలో మార్పు లేకపోయింది. దీంతో మళ్ళీ కొత్తగా “రాజా చెయ్యి వేస్తే” సినిమా ద్వారా మల్టీస్టారర్ విలనిజం తరహా సినిమాను పోషించి కాస్త పర్వాలేదనిపించుకునే పేరు తెచ్చుకున్నాడు.

ADVERTISEMENT

పేరైతే వచ్చింది గానీ, కావాల్సిన అవకాశాలు అయితే తారక్ దరిచేరలేదు. దీంతో తన వద్దకు ఎలాంటి సినిమాలు వస్తే అలాంటి సినిమాలను గుడ్డిగా ఒప్పుకుంటూ సినిమాలు చేస్తున్నారన్న విషయం, తాజాగా విడుదలైన “ఖయ్యూం భాయ్” సినిమా ధియేటిరికల్ ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఎవరో ఒక అనామక వ్యక్తి టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమాలో, ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రను తారకరత్న పోషించడం విశేషం. ఈ సినిమా ద్వారా తారక్ కు ఏదైనా ప్రయోజనం చేకూరుతుంది అంటే… అది ఒక్క రెమ్యూనరేషన్ మాత్రమే అని చెప్పాలి.

నందమూరి కాంపౌండ్ నుండి వచ్చిన వ్యక్తిగా ఇలాంటి సినిమాలలో నటించడం, నందమూరి అభిమానులు కూడా జీర్ణించుకోలేని విషయం. బహుశా ఎలాంటి సినిమాలలో నటించకపోయినా తారక్ కు వచ్చే నష్టం ఉండదు గానీ, మరీ ఇలాంటి సినిమాలలో నటిస్తే మాత్రం, సి-గ్రేడ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో ముద్ర పడిపోతుంది. దాని వలన ఎప్పుడైనా పెద్ద చిత్రాలకు ఎంపిక చేయాలన్నా ఒకటికి రెండు సార్లు దర్శకనిర్మాతలు ఆలోచించే పరిస్థితి నెలకొంటుంది. దీని కన్నా కూడా బుల్లితెరపై ఏవోక పాత్రలు వేసుకుంటూ కాలం వెలిబుచ్చడం ఉత్తమం అన్న భావన వ్యక్తమవుతోంది.

ADVERTISEMENT
Latest Stories