కేసీఆర్‌ గవర్నరట… కేటీఆర్‌ కేంద్రమంత్రట!

బీజేపీలో బిఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుందని వస్తున్న వార్తలను బిఆర్ఎస్ పార్టీలో ఎవరూ ఖండించడం లేదు. తమ పార్టీ గురించి తప్పుడు వార్తలు ప్రచురిస్తే లీగల్ నోటీస్‌ పంపిస్తామని కేటీఆర్‌ హెచ్చరించారే తప్ప ఈ విలీనం వార్తలు తప్పని ఖండించలేదు.

ADVERTISEMENT

ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి కూడా బీజేపీలో బిఆర్ఎస్ విలీనం తప్పదని తేల్చిచెప్పేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “రెండు పార్టీల మద్య చర్యలు పూర్తయ్యాయి. త్వరలోనే బిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిపోతారు.

ఆ తర్వాత కల్వకుంట్ల కవిత జైలు నుంచి విడుదలవుతారు. తెలంగాణలో బీజేపీలో బిఆర్ఎస్ విలీనం కాగానే కేసీఆర్‌కి గవర్నర్‌ పదవి లభిస్తుంది. ఆయన కుమారుడు కేటీఆర్‌కి కేంద్రమంత్రి పదవి లభించే అవకాశం ఉంది. ఇది ఊహాగానం కాదు. త్వరలో ఇదే జరుగబోతోంది,” అని అన్నారు.

రేవంత్‌ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై కేటీఆర్‌ స్పందిస్తూ, “కేసీఆర్‌ అమెరికా ప్రెసిడెంట్ అవుతారని రేవంత్‌ రెడ్డి చెపితే అయిపోతరా?” అంటూ చాలా పేలవంగా సమాధానమిచ్చారు తప్ప రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పలేదు. అంటే ‘డీల్’ కాదనలేదు.

కానీ తెలంగాణ బీజేపీ నేతలు, ముఖ్యంగా బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌ ఇందుకు అంగీకరిస్తారా?అంటే అవుననే భావించవచ్చు.

శాసనసభ ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ పార్టీకి లబ్ధి కలిగేలా అధ్యక్ష పదవి నుంచి తప్పించినప్పుడు పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి అధిష్టానం నిర్ణయాన్ని బండి సంజయ్‌ మౌనంగా అంగీకరించారు తప్ప ఎదురు ప్రశ్నించలేదు. బండి సంజయ్‌ ఇప్పుడు కేంద్ర సహాయమంత్రిగా ఉన్నారు. కనుక అధిష్టానం నిర్ణయాన్ని కాదనకపోవచ్చు.

ఈటల రాజేందర్‌కి తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కనుక హరీష్ రావు, కేటీఆర్‌ తదితర బిఆర్ఎస్ నేతలు తన కింద పనిచేసేందుకు సిద్దపడితే ఆయన కూడా విలీనానికి అంగీకరించే అవకాశం ఉంది.

కానీ ఇంతకాలం కత్తులు దూసుకున్న బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు విలీనం అయితే ఇమడగలవా?ప్రజలు వాటి కలయికని ఆమోదిస్తారా లేదా న్యూట్రల్‌గా ఉన్నవారు కూడా ఇకపై కాంగ్రెస్‌వైపు మొగ్గుతారా? అనేది విలీనం జరిగితే తెలుస్తుంది.

కానీ బీజేపీలో బిఆర్ఎస్ పార్టీ విలీనం అయితే కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావులకు అంతకంటే అవమానం మరొకటి ఉండదు. ఇది ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓటమి కంటే హేయమైనదే అవుతుంది. ఒకే ఒక్క ఓటమితో 23 ఏళ్ళ సుదీర్గ చరిత్ర ఉన్న బిఆర్ఎస్ పార్టీ తుడిచి పెట్టుకుపోయి గత్యంతరం లేని పరిస్థితిలో బీజేపీలో విలీనం అయితే అది అవమానమే కదా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Netflix Under Fire: Why Pay for YouTube-Level Content?

Kamiya Jani has been a popular face on social media for her way of interacting…

11 minutes ago

Mass H-1B Layoffs at Fortinet?

A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…

3 hours ago