చంద్రబాబుకు కేసీఆర్ బంపర్ ఆఫర్!

KCR - Chandrababu - Naidu-రోజు చంద్రబాబుపై విరుచుకుపడుతున్న విధానం చూస్తే మహాకూటమి కేసీఆర్ ను ఇబ్బంది పెడుతుందా అనే అనుమానం రాకమానదు. అయితే దీనికి సంబంధించి చంద్రబాబు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేసారు. కేసీఆర్ టిడిపిని తెలంగాణలో ఒంటరిగానే పోటీచయాలని, కాంగ్రెస్ తో కలవవద్దని కోరారట.

ADVERTISEMENT

[m9ad]

అప్పుడు ఎపి రాజకీయాలలో వేలు పెట్టనని అన్నారట. గతంలో టీడీపీ తెరాస కలిసి పోటీ చెయ్యాలని అనుకున్నా ముందు ఒప్పుకున్నట్టే ఒప్పుకుని ఆ తరువాత టీడీపీ ఎన్డీయే నుండి బయటకు రాగానే మాట మార్చేశారని కూడా చంద్రబాబు గతంలో చెప్పారు. దీనిబట్టి ఇప్పుడు టీడీపీ చేసిన దానికి ప్రతీకారంగా 2019 ఎన్నికలలో టీడీపీ వ్యతిరేక వర్గాలకు కేసీఆర్ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది.

ఒకవేళ కేసీఆర్ గనుక గెలిస్తే దీనితో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతిపక్షాలతోనే గాక తెరాసతో కూడా యుద్ధం చెయ్యాల్సిన పరిస్థితి చంద్రబాబుది. అంతకంటే ముందు తెలంగాణ ఎన్నికలు అయ్యే వరకు రోజుకు రెండు పూట్ల కేసీఆర్ నోట పచ్చి బూతులు కూడా వినకతప్పదు.

ADVERTISEMENT
Latest Stories